70కే కుప్పకూలిన బెంగళూరు
తొలి మ్యాచ్‌లో సిఎస్‌కె విజయం
చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 12వ సీజన్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ శుభారంభం చేసింది. బౌలర్లు రాణించడంతో శనివా రం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 7 వికెట్లతో ఘన విజయం సాధించింది. 71 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన సూప ర్ కింగ్స్ (17.4 ఓవర్ల)లో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. రాయుడు సురేశ్ రైనా (19) రాణించారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చెన్నై స్పిన్నర్లు తిప్పేశారు. భారీ అంచనాలతో కొత్త సీజన్‌లో అడుగుపెట్టిన ఆర్‌సిబికి చెన్నైస్పిన్నర్లు షాకిచ్చారు. జరిగిన తొలి మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఆర్‌సిబి 17.1 ఓవర్లలో 70 పరుగులకే కుప్పకూలింది. వీరి ధాటికి పరుగులు చేసేందుకు కోహ్లీసేన విలవిల్లాడింది. ఓపెనర్ పార్థివ్ పటేల్ (29; 35 బంతుల్లో 2 ఫోర్లు) మినహా మరెవ్వరూ రెండంకెల పరుగుల మార్కును దాటలేక పోయారు. కెప్టెన్ కోహ్లీ (6), మొయిన్ అలీ (9), ఏబీ డివిలియర్స్ (9), హెట్‌మైర్ (0), శివ్ దూబె (2), గ్రాండ్‌హోమ్ (4) ఘోరంగా విఫలమయ్యారు. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (3/20), రవీంద్ర జడేజా (2/15) ఇమ్రాన్ తాహిర్ (3/9) ఆర్‌సిబిని హడలెత్తించారు.
అమర జవాన్లకు బిసిసిఐ రూ. 20కోట్లు విరాళం
భారత క్రికెట్ మండలీ (బిసిసిఐ) అమర జవాన్ల కోసం భారీ విరాళం అందించింది. శనివారం చెన్నై, బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్ ఆరంభానికి ముందు బిసిసిఐ రూ. 20కోట్లు విరాళంగా ఇచ్చింది. ఈ మొత్తం డబ్బులో 11కోట్లు భారత ఆర్మీకు, 7 కోట్లు సిఆర్‌పిఎఫ్‌కు, మరొకొక్క కోటి రూపాయాలు భారత నేవి, ఏయిర్ ఫోర్స్‌కు డొనేట్ చేసింది. ముందుగానే ప్రకటించినట్టుగా ఐపిఎల్ ప్రారంభోత్సావనికి ఖర్చు చేసే మొత్తం డబ్బును విరాళంగా ఇచ్చింది.
చెన్నై స్పిన్నర్లు తిప్పేశారు
RELATED ARTICLES