కోల్‌కతా:చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి మెరిసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన ఏకపక్ష మ్యాచ్‌లో 49 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిఎస్‌కెకు ఇది వరుసగా మూడో విజయం. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 235 పరుగులు చేసింది. కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా..20ఓవర్లలో 8 వికెట్లు 186 కోల్పోయి పరుగులు చేసింది. కెకెఆర్ బ్యాటర్లలో జేసన్ రాయ్ (61; 26 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లు), రింకు సింగ్ (53; 33 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మాత్రమే పోరాడారు. చెన్నై బౌలర్లలో తుషార్ దేశ్ పాండే, మహీశ్ తీక్షణ రెండేసి వికెట్లు పడగొట్టగా.. ఆకాశ్ సింగ్, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, పతిరన ఒక్కో వికెట్ తీశారు. చెన్నై బ్యాటర్లలో అజింక్య రహానె (71; 29 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శివమ్ దూబే (50; 21 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించగా.. డేవాన్ కాన్వే (56; 40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లు), రుతురాజ్ గైక్వాడ (35; 20 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు), జడేజా (18; 8 బంతుల్లో 2 సిక్స్‌లు) రాణించారు. కోల్‌కతా బౌలర్లలో కుల్వంత్ ఖేజ్రోలియా రెండు, సుయాశ్ శర్మ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
చెన్నై సూపర్ కింగ్స్‌హ్యాట్రిక్ విజయం
RELATED ARTICLES