శిథిలావస్థకు చేరిన ఘడియ గౌరారం గ్రామ పాఠశాల తరగతి గదులు : ఐదు క్లాస్‌లకు ఒకే గదిలో పాఠాలు
ప్రజాపక్షం / చింతపల్లి : “ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు చదువుకోవాలంటే కష్టమైన పరిస్థితి ఏర్పడింది. టీచర్లు లేకనో, సీటు దొరక్కనో కాదు… కూర్చుని చదువుకోవడానికి తగిన భవనాలు లేకపోవడమే ఇందుకు కారణం. సర్కార్ బడుల్లో విద్యార్థులు చెట్ల కింద కూర్చుని చదువుకునే పరిస్థితి ఇంకా మారడం లేదు. కొన్ని బడులకు సొంత భవనాలు లేక మరికొన్ని బడుల భవనాలు శిధిలావస్థలో ఉండడంతో పిల్లలకు ఈ దుస్థితి తప్ప డం లేదు. పాఠాలు చెప్పేందుకు టీచర్లు ఉన్నా గదులు లేక చెట్ల కిందే ఉండి చదువుకోవాల్సిన పరిస్థితి. నల్లగొండ జిల్లా చింతపల్లి మండల పరిధిలోని ఘడియ గౌరారం గ్రామానికి చెందిన ప్రాథమిక పాఠశాల ఇలాంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. తరగతి గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఐదు తరగతి గదులతో 50 ఏళ్ల కింద నిర్మించిన ఈ పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి ప్రమదకరంగా మారింది. దీంతో ఎక్కడ ప్రమాదం జరుగుతుందోనని ఈ గదులను వినియోగించడం మానేశారు. 2002 సంవత్సరంలో రెండు నూతన గదులను నిర్మించగా ఒక గదిలో ప్రధానొపాధ్యాయుడు, ఉపాధ్యాయులుండగా, మరోక గదిలో విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు. ఈ పాఠశాలలో తెలుగుతో పాటు ఇంగ్లీష్ మీడియం కూడా ఉండడంతో 80 మంది పైగా విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నారు. మరోవైపు ప్రస్తుతం కరోనా విజృంభించి ఫీజుల బాధ భరించలేక ప్రైవేటు పాఠశాలల నుండి ప్రభుత్వపాఠశాలలకు విద్యార్థులు తరలివస్తున్న విద్యార్థులను కూర్చోబెట్టడానికి గదులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఒక తరగతి విద్యార్థులకు పాఠాలు బోధించే సమయంలో మరోక తరగతి విద్యార్థులు అదే తరగతి గదిలో ఉండడంతో అయోమయానికి గురై విద్యాభ్యాసంపై దృష్టి పెట్టలేకపోతున్నామని విద్యార్థులు తెలిపారు. వర్షం పడితే సమస్య మరింత జఠిలమవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యా రంగానికి తగిన ప్రాధాన్యతను ఇస్తున్నామని ప్రకటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పిల్లలు చదువుకోవడానికి తగిన సౌకర్యాలు ఎందుకు కల్పించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
నూతన భవనాన్ని నిర్మించాలి
“పాఠాలు చెప్పేందుకు టీచర్లు, వినేందుకు విద్యార్థులు ఉన్నా కూర్చునేందుకు తరగతి గదులు లేకపోవడం బాధాకరం. పాఠశాలలో తరగతి గదుల సమస్యను పలుమార్లు సమస్యను ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా పట్టించుకోవడంలేదు. ప్రభుత్వం నూతన భవనాలను నిర్మించి విద్యార్థుల చదువులు నిరాటంకంగా కొనసాగే విధంగా చర్యలు తీసుకోవాలి” అని పాఠశాల ఎస్‌ఎమ్‌సి చైర్మన్ రహీమ్, విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.
చెట్ల కింద ఇంకెన్నాళ్లు..
RELATED ARTICLES