ప్రజాపక్షం /రుద్రంగి : రుద్రంగి మండలకేంద్రంలోని,పోలీస్ చెక్ పోస్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్నా పోలీసులకు బాలాజీ ట్రావెల్స్ యజమాని ధరవత్ విఠల్,మధ్యాన్న భోజనం ఏర్పాటు చేశారు,విఠల్ మాట్లాడుతూ,కరోన వ్యాధి ని అరికట్టడంలో పోలీసులు డాక్టర్లు పారిశుధ్య కార్మికులు మీడియా వారు ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు,రుద్రంగి పోలీసులు కరోన కర్ఫ్యూ ను విజయవంతం చేసారని అన్నారు,ప్రజలు ఇంటిలోనుండి బయటకు రాకుండా అవగాహన కల్పిస్తున్నారని అన్నారు,అలాగే వాహనదారులకు అవగాహన కల్పిస్తూ రాకపోకలను నిలిపివేయడానికి ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ వద్ద నిత్యం కాపల కాస్తున్నారని అన్నారు, అలాంటి పోలీసులకు నా వంతుగా భోజనం ఏర్పాటు చేసి తీసుకువచ్చనని అన్నారు, పోలీసులు తమ ప్రాణాలు అడ్డుపెట్టి విధులు నిర్వర్తిస్తూ మనల్ని కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉండమని చెప్తున్నారు,కాబట్టి వాళ్ళు చెప్పింది విని ప్రతి ఒక్కరు ఏప్రిల్ 14 వరకు లక్ డౌన్ పాటించాలని కోరారు,ఈ కార్యక్రమంలో, రాంసింగ్,మోహన్,ఉపేందర్,సుధాకర్, దేవేందర్,తదితరులు పాల్గొన్నారు