చెంచులకు ఉచితంగా కూరగాయల పంపిణీ
కరోనా నేపథ్యంలో చెంచు పెంటల్లో చెంచులకు ఉచితంగా కూరగాయల పంపిణీ
గిరిజన కో-ఆపరేటివ్ సంస్థలో నిత్యావసర సరుకులపై ఆరా తీసిన – పిఓ ఐటీడీఏ అఖిలేష్ రెడ్డి
ప్రజాపక్షం / నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి
అమ్రాబాద్, పదరా మండలాల పరిధిలోని అప్పాపూర్ మల్లాపూర్ పుల్లయ్య పల్లి, మేడి మల్కా ల, తదితర చెంచు పెంటల్లో జీవనం సాగిస్తున్న చెంచులకు కరోనా నేపథ్యంలో చెంచులు పంటల నుండి బయటికి రాలేని పరిస్థితుల వలన కూరగాయలను చెంచులకు నేడు పిఓ ఐటిడిఎ అఖిలేష్ రెడ్డి ఉచితంగా పంపిణీ చేశారు. అదేవిధంగా
గిరిజన కో-ఆపరేటివ్ కార్పొరేషన్ సంస్థ ద్వారా ప్రతినెల సరఫరా చేస్తున్న బియ్యం, పప్పు, నూనె, చెక్కర, తదితర నిత్యావసర సరుకులు ప్రతి నెల అందుతున్నాయా లేవు అన్న విషయాలను చెంచు పెంటల చెంచులను అడిగి తెలుసుకున్నారు.
జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు గిరిజన కో-ఆపరేటివ్ సంస్థల వాహనాల ద్వారా నిత్యావసర సరుకుల తో పాటు కూరగాయలను తీసుకువెళ్లి గిరిజన కో-ఆపరేటివ్ సంస్థలో అందుబాటులో ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు.
అక్కడి నుండే చెంచులు తమకు అవసరమైన కూరగాయలను కొనుక్కోవాలని పిఓఐటిడిఎ అఖిలేష్ రెడ్డి చెంచులకు సూచించారు.
ఉపాధి హామీ పథకం ద్వారా నిర్వహించే పనులకు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఉపాధి పనులకు హాజరయ్యే చెంచులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎవరు కూడా పెంట లను వదిలి బయటికి వెళ్లకూడదని కోరారు.
సబ్బుతో శుభ్రంగా చేతులు కడుక్కోవాలని, కరోనా వైరస్ పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెంచులకు అవగాహన కల్పించారు.