ప్రజాపక్షం/కరీంనగర్; చట్టాలు ఎంత కఠినం చేసిన మహిళలు, చిన్నారుల పట్ల అఘాయిత్యాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. తొమ్మిదేళ్ల బాలికపై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన కరీంనగర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. జిల్లాకేంద్రంలో ఓ వ్యక్తి ఆటోడ్రైవర్‌గా, అతడి భార్య బట్టల దుకాణంలో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి మూడో తరగతి చదువుతున్న 9 ఏళ్లు కుమార్తె ఉంది. స్థానికంగా ఉన్న పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. ఈనెల 25న చిన్నారికి జ్వరం, తలనొప్పి వచ్చిందని చెప్పడంతో ఇంటి వద్ద ఉంది. బాలిక తల్లిదండ్రులు వారి పనుల నిమిత్తం వెళ్లారు. చిన్నారి ఇంటి వద్ద ఒంటరిగా ఉండడాన్ని పక్కింటికి చెందిన వినేశ్ (20), శ్రీను (18), రవితేజ(12)లు పసిగట్టారు. ఈ ముగుగరు ఆ చిన్నారిని ఆడుకుందామని తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డారు. అయితే విషయాన్ని చిన్నారి భయంతో ఎవరికి చెప్పలేదు.మరుసటి రోజు చిన్నారికి జ్వరం రావడంతో తల్లి మందులు వేసింది. అయితే చిన్నారి మలమూత్రాలకు వెళ్లడానికి ఇబ్బంది పడుతుంటే అనుమానం వచ్చిన తల్లి కుమార్తెను విచారించింది.ఏం జరిగిందో చెబి తే జ్వరం తగ్గుతుందని బుజ్జగించింది. దీంతో ఆ బాలిక వినేష్, శ్రీను, రవితేజలు ఆడుకుందామని పిలిచి తనపై అత్యాచారం చేశారని చెప్పింది. దీంతో తల్లిదండ్రులు చిన్నారిని స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యురాలికి చూపించగా చిన్నారిపై అత్యాచారం జరిగిందని డాక్టర్ నిర్ధారించారు. దీంతో బాలిక తల్లిదండ్రులు మూడవ పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి పంపారు. అంబేద్కర్‌నగర్‌లోని ఘటన జరిగి స్థలానికి ఎసిపి అశోక్,సిఐ విజ్ఞాన్‌రావు చేరుకొని విచారణ చేపట్టారు. ఈ మేరకు నిందితులపై ఫో క్సో, తదితర చట్టాల కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
చిన్నారిపై సామూహిక అత్యాచారం
RELATED ARTICLES