కరోనా వ్యాక్సిన్ వచ్చేవరకు నిర్లక్ష్యం వద్దు
జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: లాక్‌డౌన్ మాత్రమే పూర్తయిందని, కరో నా వైరస్ ఇంకా అంతం కాలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. మంగళవారంనాడు ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. వ్యాక్సిన్ వచ్చే వరకు ఎట్టిపరిస్థితుల్లోనే నిర్ల క్ష్యం వహించవద్దని, కొవిడ్ 19 చాలా ప్రమాదకరమని గ్రహించాలని హెచ్చరించారు. వ్యాక్సిన్ వచ్చిన వెంటనే ప్రతి భారతీయుడికి చేరవేసేందుకు ప్రభు త్వం సిద్ధంగా ఉందని చెప్పారు. వైరస్ పోయిందని, ప్రమాదం లేదని అనుకోవద్దని ప్రజలకు సూచించారు. పండుగల వేళ ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్న సంతోషాలు దూరమైపోతాయని హెచ్చరించారు. కరోనా విజృంభణ తర్వాత జాతినుద్దేశించి మోడీ ప్రసంగించడం ఇది ఏడోసారి. ఆరంభంలో కరోనా పట్ల అప్రమత్తంగా ఉన్న ప్రజలు ఇప్పుడు కొంత అజాగ్రత్తగా వ్యవహరిస్తున్నారని, అందుకే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో కరోనా కేసులు తగ్గినా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయని గుర్తు చేశారు. వ్యాక్సిన్ చేరవేతకు సంబంధించి అవసరమైన పనులు వేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. “కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ పూర్తయింది. కానీ వైరస్ ఇంకా మన మధ్యనే ఉంది. ప్రజలు కరోనా జాగ్రత్తలను పట్టించుకోకుండా ఉన్న కొన్ని వీడియోలు వైరల్ అయ్యా యి. ఇలా నిబంధనలు పాటించకపోవడం ఏ మాత్రం మంచిది కాదు. మాస్కులు లేకుండా అజాగ్రత్తగా తిరిగితే మీతో పాటు మీ పిల్లలు, పెద్దలను ప్రమాదంలోకి నెట్టిన వారు అవుతారు. నవరాత్రులు, దసరా, దీపావళి వేళ మనందరం మరింత అప్రమత్తంగా ఉండాలి. అగ్నిని, శత్రువును, వ్యాధిని తక్కువ చేసి చూడవద్దు” అని మోడీ అన్నారు. దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. ఆరడుగుల దూరం, మాస్కు ధరించడం తప్పనిసరి అని, పండుగల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని కోరారు. దేశ ప్రజలంతా కరోనా కట్టడికి కంకణబద్ధులై ముందడుగు వేయాలని కోరారు. నవరాత్రులు, మన దేశంలో కరోనా రికవరీ రేటు చాలా బాగుందని, దేశంలో 10 లక్షల మందిలో ఐదున్నర వేల మందికే కరోనా సోకిందనని చెప్పారు. అమెరికా, బ్రెజిల్ వంటి దేశాల్లో 10 లక్షల మందిలో 25 వేలమందికి సోకిందని గుర్తుచేశారు. కరోనా పరీక్షల కోసం 2 వేల ల్యాబ్‌లు పనిచేస్తున్నాయని, త్వరలోనే కరోనా పరీక్షల సంఖ్య 10 కోట్లు దాటిపోతుందన్నారు. పరీక్షల సంఖ్య పెంచడంలో వైద్య వ్యవస్థ అత్యంత వేగంగా పనిచేసిందని, వైద్యులు, నర్సులు, వైద్య సిబ్బంది సేవాభావంతో పనిచేశాదని కొనియాడారు.
చాలా డేంజర్!
RELATED ARTICLES