లష్కరే తొయిబాకు సహకారం
ఐక్యరాజ్య సమితి నివేదిక
న్యూయార్క్: ప్రస్తుతానికి అల్ తగ్గి ఉందని, పాకిస్థాన్ కు చెందిన ఉగ్రవాద సంస్థలు లష్కరే తొయిబా, హఖ్ఖానీ నెట్‌వర్క్‌లకు సన్నిహితంగా ఉంటూ సహకరిస్తోందని ఐక్యరాజ్యసమితి నివేదిక పేర్కొంది. అయితే అల్ నాయకుడు ఐమాన్ ముహమ్మద్ అల్ ఆరోగ్య పరిస్థితి, ఆయన స్థానంలో వచ్చే వారసుడి విషయంలో మాత్రం అనుమానాలు నెలకొని ఉన్నాయని ఐరాస తన నివేదికలో పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అల్ ఆంక్షల కమిటీకి విశ్లేషణ మద్దతు, ఆంక్షల పర్యవేక్షణ బృందం ఈ నెల సమర్పించిన 24వ నివేదికలో ఈ విషయం పేర్కొన్నారు. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్), అల్ వాటితో సంబంధం ఉన్న వ్యక్తులు, గ్రూపులు, సంస్థలపై ఆరు నెలలకోసారి ఆంక్షల పర్యవేక్షణ బృందం స్వతంత్ర నివేదికలను భద్రతా మండలికి సమర్పిస్తుంటుంది. అల్ ఆఫ్ఘనిస్థాన్‌ను సురక్షిత ప్రాంతంగా భావిస్తోంది. అక్కడ తాలిబన్లతో ఉన్న దీర్ఘకాలిక, బలమైన సంబంధాలను నమ్ముతోందని ఆ నివేదిక పేర్కొంది. తాలిబన్ల పరిపోషకత్వంలో బదక్షాన్ ప్రాంతంలో తన ఉనికిని అల్ బలపరుచుకోవాలనుకుంటోంది. ప్రధానంగా తజకిస్థాన్ సరిహద్దులోని షింఘ్‌నన్ ప్రాంతం, అలాగే బార్మల్, పాక్తిక ప్రాంతంలో బలపడాలనుకుంటోంది. ఆర్థిక సంపత్తి, మీడియా ప్రొఫైల్, పోరాడే పటిమ, ఉగ్రవాద నైపుణ్యంరీత్యా ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లేవంట్(ఐసిల్), అల్ కన్నా ప్రపంచ భద్రతకు పెను ముప్పు గా తయారైందని నివేదికలో పేర్కొన్నారు. శ్రీలంకలో ఈ మధ్య జరిగిన ఈస్టర్ సండే ఉగ్రదాడులను ప్రస్తావిస్తూ దానికి తనదే బాధ్యత అని ఐసిల్ పేర్కొ ందన్న విషయాన్ని ఉటంకించింది. ఇరాక్, సిరియా లో ఐసిల్ సైనికపరంగా దెబ్బతిన్నాక అది స్థానికుల మద్దతుతోనే బాంబు పేలుళ్లకు పాల్పడుతోందన్నది. ఐసిల్ ఉగ్రవాదం భవిష్కత్ పథక రచనకు శ్రీలంకలో జరిగిన ఈస్టర్ సండే దాడులను బ్లూ ప్రింట్‌గా భావించొచ్చంది. న్యూజిలాండ్‌లోని క్రీస్ట్‌చర్చి దాడులను కూడా మార్చిలో ఐసిల్ నిర్వహించింది.అంతర్జాతీయంగా ఆధిప త్యం దక్కించుకోడానికి ఐసిల్,అల్ పోటీపడుతున్నాయ ని కూడా ఐక్యరాజ్యసమితి తన నివేదికలో పేర్కొం ది. పశ్చిమ ఆఫ్రికా,సహేల్‌లో ఐసిల్, అల్ రెం డూ క్రియాశీలకంగా ఉన్నాయి. అక్కడి బలహీనమై న ప్రాంతీయ రాష్ట్రాలను అస్థిరపరుస్తున్నాయన్నది.