తొలిసారి ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ కైవసం
ఫైనల్లో గాయంతో తప్పుకున్న మారీన్
జకార్తా: భారత స్టార్ షట్లర్, తెలుగు తేజం సైనా నెహ్వాల్ ఇండోనేషియా మాస్టర్స్ సూపర్ సిరీస్ టైటిల్‌ను గెలుచుకుంది. గత ఏడాది రన్నరప్‌గా నిలిచిన సైనా ఈ సారి టైటిల్ కైవసం చేసుకుంది. ఇది సైనాకు తొలి ఇండోనేషియా ఓపెన్ టైటిల్ కావడం విశేషం. మరోవైపు దాదాపు రెండేళ్ల తర్వాత సైనా తొలి బిడబ్ల్యూఎఫ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. 2017లో చివరి సారి మలేషియా మాస్టర్స్ గెలుచుకున్న సైనా తాజాగా ఇప్పుడు ఇండోనేషియా మాస్టర్స్ టైటిల్ నెగ్గింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ ఫైనల్లో మూడు సార్లు ప్రపంచ చాంపియన్, ఒలింపిక్ విజేత కారోలినా మారీన్ మోకాలి గాయం కారణంగా మధ్యలోనే మ్యాచ్ నుంచి తప్పుకుంది. తొలి గేమ్‌ను దూకుడుగా ఆరంభించిన మారీన్ 9 ఆధిక్యంలో ఉన్నప్పుడు కుడి కాలుకి గాయమైంది. కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్న మారీన్ తర్వాత తిరిగి రాకెట్ పట్టింది. అదే జోరును కొనసాగించిన మారిన్ సైనాను ఒత్తిడిలో నెట్టింది. తొలి గేమ్‌లో దూకుడును ప్రదర్శించిన మారీన్ 10- ఆధిక్యంలో నిలిచింది. ఈ సమయంలో గాయం తీవ్రత మరింత పెరిగింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న మారీన్ రిటైర్డ్ హర్ట్‌గా మ్యాచ్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. దీంతో సైనా పెద్దగా శ్రమించకుండానే టైటిల్‌ను తన ఖాతాలో వేసుకుంది. గత కొంత కాలంగా అద్భుతంగా రాణిస్తున్న సైనా ఈ ఏడాది తొలి సూపర్ సిరీస్‌ను గెలుచుకుని నూతన సంవత్సరాన్ని శుభారంభం చేసింది. గత వారం జరిగిన మలేషియా ఓపెన్‌లో సైనా సెమీస్‌లో మారీన్ చేతిలోనే ఓటమిపాలైంది. కానీ ఈసారి దానికి ప్రతీకారం తీర్చుకోవాలని భావించిన సైనా పోరాడకుండానే టైటిల్ సాధించింది. ఇక తర్వాతి టోర్నీలో మారీన్‌ను ఓడిస్తుందేమో చూడాలి. వీరిద్దరూ ముఖాముఖిగా మొత్తం 11 సార్లు తలపడితే అందులో సైనా 5 సార్లు మాత్రమే గెలిచింది. భారత మరో స్టార్ ప్రపంచ మూడో ర్యాంకర్ పివి సింధు కూడా ఈ టోర్నీలో మారీన్ చేతిలో ఓటమిపాలై క్వార్టర్స్‌లోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. గత కొంత కాలంగా సైనాను కూడా గాయాలు వెంటాడుతున్నాయి. అందుకే మంచి ప్రదర్శనలు చేయలేక పోతున్నానని సైనా మ్యాచ్ అనంతరం తెలిపింది. 2016 ఒలింపిక్స్ సమయంలో తనకు మోకాలికి గాయమైంది. అప్పటి నుంచి ఆ గాయం తనను వెంటాడుతూనే ఉందని చెప్పింది. తర్వాత తన కాలికి ఎన్నో శస్త్ర చికిత్సలు జరిగాయి. వాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని సైనా అన్నది. రానున్న ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన ముందున్న పెద్ద లక్ష్యమని ఆమె అంది. ఈ ఏడాది తొలి టైటిల్ గెలువడం సంతోషంగా ఉందని, ఈ విజయంతో తన ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అయిందని, తర్వాతి టోర్నీల్లోనూ మంచి ప్రదర్శనలు చేసి భారత్‌కు మరిన్ని పతకాలు అందిస్తానని సైనా పేర్కొంది.
మొమోటాకు అంటోన్సెన్ షాక్..
పురుషుల సింగిల్స్‌లో సంచలనం నమోదైంది. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జపాన్ స్టార్ కెంటో మొమోటాకు డెన్మార్క్ ఆటగాడు అండర్స్ అంటోన్సెన్ షాకిచ్చాడు. ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో అండర్స్ అంటోన్సెన్ (డెన్మార్క్) 21 14 21 తేడాతో ప్రపంచ నెంబర్ వన్ కెంటో మొమోటా (జపాన్)ను ఓడించి టై టిల్ కైవసం చేసుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అంటోన్సెన్ తొలి గేమ్‌ను ఈజీగా గెలుచుకున్నాడు. రెండో గేమ్‌లో పుంజుకున్న మొమోటా ఈ గేమ్‌ను 21 14తో గెలుచుకున్నాడు. కానీ కీలకమైన చివరి గేమ్‌లో మాత్రం మొమోటా మరోసారి తేలిపోవడంతో విజయం అంటోన్సెన్‌కు వరించింది.
చాంపియన్ సైనా
RELATED ARTICLES