గ్యాన్ పాథక్
ఈశాన్య భారత్‌లో చలిగాలులు వీస్తున్నాయి. జాతి కలహాలతో చలికాచుకుంటున్న మణిపూర్‌నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ ఈ 14న ప్రారంభించిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ తొలి వారం ఈశాన్య భారత్‌లో రాజకీయ వేడి రగిల్చింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ విద్వేషపూరిత, విభజనవాద రాజకీయాలకు వ్యతిరేకంగా జాతి జను మధ్య సామరస్యం, సమైక్యత పెంపొందించే ఉద్దేశంతో, సామాజిక న్యాయం నెలకొల్పే నిమిత్తం తూర్పునుండి పశ్చిమానికి (మణిపూర్ నుంచి ముంబయికి) రాహుల్ యాత్రను ప్రారంభించింది. ఇది అంతకుముందు కన్యాకుమారి నుంచి కశ్మీర్‌కు రాహుల్ సాగించిన పాదయాత్రకు పొడిగింపు. ఆ ‘భారత్ జోడో యాత్ర’ కర్నాటక, తెలంగాణల్లో కాంగ్రెస్‌కు రాజకీయ లబ్ది చేకూర్చింది. బస్సు ప్రయాణ, కాలి నడక మిశ్రమంగా సాగుతున్న ఈ ‘…న్యాయ యాత్ర ప్రధానంగా హిందీ భాషా రాష్ట్రాలగుండా పశ్చిమానికి సాగుతుంది. రానున్న లోక్‌సభ ఎన్నికల రీత్యా, మార్చిలో ఈ యాత్ర ముగుస్తుంది. అయితే అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సవాన్ని అతిపెద్ద ఈవెంట్‌గా ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథి రామజన్మ తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వహిస్తూ, ము ఖ్యంగా ఉత్తరాది రాష్ట్రాల్లో ‘అంతా రామమయం’ గా ఆ ప్రచారాన్ని వివిధ రూపాల్లో గ్రామగ్రామానికీ తీసుకెళ్లినందున వచ్చే ఎన్నికల్లో ఈ హిం దూత్వ ప్రభుత్వాన్ని రాహుల్ యాత్ర ఎంతమేరకు వెనక్కు కొట్టగలదన్నది లౌకిక, ప్రజాస్వామ్యవాదులను తొలుస్తున్న ప్రశ్న. అయితే ‘న్యాయయాత్ర’కు ఈశాన్య భారత్‌లో లభిస్తున్న ప్రజాదరణ ఆశావహంగా ఉంది. యాత్ర బిజెపి నాయకుల్లో, ము ఖ్యంగా అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ లో కలవరం కలిగిస్తోంది. ఆయన చేతలు, ప్రకటనలు దీన్ని వెల్లడిస్తున్నాయి. ఈశాన్య భారత్‌లోని 25 లోక్‌సభ సీట్లలో 20 ఎన్‌డిఎ ఖాతాలో వున్నా యి. వాటిలో బిజెపి వాటా 15. నరేంద్రమోడీ మూడవ పదవీకాలం కోసం పరుగిడుతున్న ఈ స మయంలో బిజెపికి అవి ఎంతో విలువైనవి. హి మంత ఈశాన్యంలో బిజెపికి, ఎన్‌డిఎకి నాయకత్వం వహిస్తున్నందున వాటిని తిరిగి గెలుచుకోవటంపైనే ఆయన రాజకీయ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.
రాహుల్ యాత్ర మణిపూర్, నాగాలాండ్‌లు పూర్తి చేసుకుని ప్రస్తుతం అసోంలో ప్రయాణిస్తున్న మణిపూర్‌లో ఇంఫాల్‌సహా 107 కిలోమీటర్లు సాగింది. బిజెపి నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వంలో మే నెలలో చెలరేగిన జాతులమధ్య హింస రాష్ర్ట ప్రజలకు కనీవినీ ఎరుగని కడగండ్లు కలుగజేసింది. లోక్‌సభ స్థానాలు 2. గత (2019) లోక్‌సభ ఎన్నికల్లో బిజెపి ఒక సీటు గెలుచుకుంది. బిజెపి అభ్యర్థికి కాంగ్రెస్ అభ్యర్థిపై 17,755 ఓట్లు మెజారిటీ లభించింది. రెండో సీటును 73,782 ఓట్ల మెజారిటీతో నాగా పీపుల్స్ ఫ్రంట్ గెలుచుకుంది. మణిపూర్ హింస ఈ పర్యాయం బిజెపి విజయావకాశాలను దెబ్బతీస్తున్నది. కాంగ్రెస్ ఓటు స్వల్పంగా పెరిగినా అది బిజెపికి చేటు అవుతుంది. న్యాయయాత్రకు మణిపూర్‌లో లభించిన మంచి తోడ్పాటు బిజెపి నాయకులను కలవరపెడుతున్నది.
నాగాలాండ్‌లో రాహుల్ యాత్ర రెండ్రోజుల్లో 5 జిల్లాలగుండా 257 కిలోమీటర్లు ప్రయాణించిం అందులో రాజధాని కోహిమా కూడా ఉంది. ఈ రాష్ర్టంలోని ఏకైక లోక్‌సభ సీటును గత ఎన్నిక ల్లో ఎన్‌డిఎలో భాగస్వామి అయిన నేషనల్ డెమొక్రటిక్ ప్రోగ్రెస్ పార్టీ (ఎన్‌డిపిపి) గెలుచుకుంది. కాంగ్రెస్‌కు 48.11శాతం ఓట్లు లభించగా, ఎన్‌డిపిపికి 49.73 శాతం పోలైనాయి. ఇక్కడ కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ వైపు కొద్దిపాటి ఓటర్ల మొగ్గు ఎన్‌డిఎకు నష్టం చేస్తుంది. మూడవరోజున, జనవరి 18న అసోంలో ప్రవేశించింది. ఈ యాత్ర అసోంలో 8 రోజులపాటు 833 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఈ రాష్ర్టంలో 14లోక్‌సభ స్థానాలున్నందున ముఖ్యమంత్రి హి మంత బిశ్వశర్మకు అది మరింత కలత కలిగిస్తోం ది. 2019లో బిజెపి 9 సీట్లు గెలుపొందింది. అయి తే దానికి లభించిన ఓట్లు 36.05 శాతమే. కాగా కాంగ్రెస్‌కు 3 స్థానాలే దక్కినప్పటికీ 35.44 శా తం ఓట్లు లభించాయి. 2014 ఎన్నికలతో పోల్చితే బిజెపి 2019లో 2 సీట్లు అదనంగా లభించినా ఓటు శాతం 0.45 తగ్గింది. కాగా కాంగ్రెస్ ఓటు 5.84శాతం పెరిగింది. ఎఐయుడిఎఫ్ తన 2 సీట్లు కోల్పోయినా 7.8 శాతం ఓట్లు పెంచుకుంది. అసోంలో ప్రవేశించకమునుపే కాంగ్రెస్ ఎఐయుడిఎఫ్ రాష్ర్టంలో సీట్లు పంపిణీని దాదాపు పూర్తి చేసుకున్నాయి. కాంగ్రెస్ 11, ఎఐయుడిఎఫ్ 3 సీట్లు పోటీ చేస్తాయి. రెండు పార్టీల ఓట్లు కలిపితే బిజెపిని మించిపోతాయి. ముఖ్యమంత్రి కలతకు ఇది ముఖ్యకారణం. యాత్రకు ప్రజాదరణ మరింత బెంబేలెత్తుస్తున్నది.
కాంగెస్ తన ఉనికిని, ప్రజాదరణను పునరుద్ధరించుకునేందుకు రాహుల్ యాత్ర నిస్సందేహంగా తోడ్పడుతుంది. అయితే నిర్మాణ బలహీనతలు, గ్రూపులు బయటపడుతున్నాయి. ఈ ప్రాం తంలో అపరిష్కృతంగా ఉన్న హింస, కొన్ని సముదాయాలతో శాంతి చర్చలు, పౌరసత్వ సవరణ చ ట్టం, మణిపూర్‌లో ఇన్నర్ లైన్ పర్మిట్ పద్ధతి తదితర అంశాలను రాహుల్ ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. ఈ యాత్రకు అసోం ముఖ్యమంత్రి, అధికారులు ఆటంకాలు కలిగిస్తున్నారు. కాంగ్రెస్ జా తి వ్యతిరేక, విభజనవాద, అవినీతి పార్టీ అని వా రు నిందిస్తుంటే, ముఖ్యమంత్రి హిమంత విశ్వ శర్మ దేశంలోనే అత్యంత అవినీతిపరుడని రాహుల్ ప్రత్యారోపణ చేశారు. అరుణాచల్ ప్రదేశ్‌లో 55 కి.మీ.లు, మేఘాలయలో 5 రోజులు ప్రయాణిస్తుంది. అంటే ఈశాన్య భారత్‌లోని 8లో 5 రాష్ట్రాల గుండా యాత్ర సాగుతుంది. ఈ యాత్ర వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు, ఇండియా కూటమి భాగస్వాములకు ఎంతో కొంత మేలు చేస్తుందనుటలో సందేహం లేదు.
అరుణ్‌కుమార్ శ్రీవాస్తవ్
ఈ సంవత్సరం ఏప్రిల్ మే నెలల్లో లోక్‌సభ ఎన్నికలో జరుగుతాయి. బిజెపి, దాని మిత్రపక్షాల ని యంతణ్రలో 16 రాష్ట్రాలున్నందున జాతీయ రాజకీయాలపై దాని పట్టు కొనసాగుతుందని ఊహించటం సులభం. వేసవి వేడిని నాయకులు, ఓటర్లు ఎలా తట్టుకుంటారో వేచిచూడాల్సిందే. అయితే జాతీయ రాజకీయాల్లో కాషాయ సెంటిమెంట్ ప్ర బలంగా ఉందని భావించినపుడు, అది ఎవరిని దెబ్బకొడుతుందో ఊహించటం కష్టం కాదు. 2019 ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు మాత్రమే ఎన్నికైనారు. ఈ పర్యాయం వారి సంఖ్య ఎంత ఉంటుందో ఉత్కంఠ కలిగించే అంశం. కాంగ్రెస్ ముఖ్త్ భారత్ కోసం బిజెపి పిలుపు ఈ ప ర్యాయం ముస్లిం ముఖ్త్ పార్లమెంటుకు విస్తరించవచ్చు. భారతదేశానికి ఈ పరిస్థితి రాదని, కొత్త పా ర్లమెంటులో తగినంత సంఖ్యలో ముస్లింల ప్రాతినిధ్యం ఉంటుందని ఆశిద్దాం. వ్యతిరేకం ప్రతిపక్షాలు సంఘటితమవుతున్నాయి. అయి తే బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్‌కు ఉన్నట్లుగా వారికి గతంలోవలె సింగిల్ అఖిల భారత కమాండ్ లేకపోవ టం సమస్య. మితవాద శక్తులు బలపడటం, వామపక్షాలు బలహీనపడటం ఇవాళ ప్రపంచవ్యాప్త ల క్షణం. ఇది ప్రమాదకర పరిణామమని రెండు ప్ర పంచ యుద్ధాల చరిత్ర మనకు చెబుతున్నది.
రాజకీయ సుస్థిరత అనేది నిరుద్యోగం, నాసిరకం వైద్య సంరక్షణ సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి. మరోవైపున విద్య వ్యయభరితమైం ది. సమకూరటం లేదు. ప్రతిపక్షాలు వచ్చే ఎన్నికల్లో ఈ సమస్యలు పరిష్కరించగలమన్న విశ్వాసాన్ని ప్రజలకు కలిగిస్తే అది వారికి సహాయకారి అవుతుంది. పొడవునా స్వాగతం చెప్పటానికి ప్రజలు ఉత్సా హం చూపుతున్నారు. రాహుల్ యాత్ర యువత ని రుద్యోగం, రైతుల దుస్థితిపై ఎలుగెత్తుతున్నది. దే శంలో ద్వేష వాతావరణానికి వ్యతిరేకంగా ప్రచా రం చేస్తున్నది. ప్రజల్లోని ఈ ఉత్సాహాన్ని ఓట్లలోకి మార్చుకునేందుకు కాంగ్రెస్, ఇండియా కూటమి భాగస్వాములు కృషిచేయాలి.
ఐపిఎ