ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడి
ఇప్పటి వరకు వచ్చిన ఆదాయం రూ.107 కోట్లు
ప్రజాపక్షం/హైదరాబాద్ వాహనదారులకు పోలీసుశాఖ శుభవార్త చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ఈ నెల 31 వరకు పొడిగిస్తున్నట్లు పోలీసు శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు పెండింగ్ చలాన్ల ద్వారా రూ.107 కోట్ల ఆదాయం సమకూరింది. రాష్ట్ర వ్యాప్తంగా 1.05 కోట్ల పెండింగ్ చలాన్లను వాహనదారులు చెల్లించారు. వాస్తవానికి గడువు నేటితో ముగియగా, పెండింగ్ చలాన్ల చెల్లింపునకు స్పందన వస్తుండడంతో గడువును పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3.59 కోట్ల ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. రాయితీపై పెండింగ్ చలాన్లను చెల్లించేందుకు గడువు ఇవ్వడంతో వాహనదారులు చెల్లిస్తున్నారు. సాంకేతిక సమస్యలతో చెల్లింపుల్లో ఆలస్యమవుతుందని పోలీసు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో నేటితో గడువును పొడిగించినట్లు పోలీస్ అధికారులు చెప్పారు. డిసెంబర్ 26 నుంచి పెండింగ్ చలాన్లు రాయితీపై చెల్లించేందుకు అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. ద్విచక్ర వాహనాలు, ఆటోలకు 80 శాతం రాయితీ, ఆర్‌టిసి బస్సులకు 90 శాతం, ఇతర వాహనాలకు 60 శాతం రాయితీ రాయితీని ప్రకటించారు.
చలాన్ల రాయితీ గడువు పొడిగింపు
RELATED ARTICLES