HomeNewsBreaking Newsచర్చలు విఫలం బ్యాంకుల సమ్మె యథాతథం

చర్చలు విఫలం బ్యాంకుల సమ్మె యథాతథం

తొమ్మిది లక్షల మంది బ్యాంకు ఉద్యోగులు నేడు సమ్మెబాట
న్యూఢిల్లీ/ముంబయి: బ్యాంకు ఉద్యోగులు తుది యత్నంగా అదనపు ముఖ్య కార్మిక కమిషనర్‌తో జరిపిన చర్చలు బుధవారం విఫలం కావడంతో దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన తొమ్మిదిలక్షలమంది బ్యాంకు ఉద్యోగులు గురువారం, శుక్రవారం సమ్మెకు సమాయత్తమయ్యారు. చర్చలు విఫలం కావడంతో ముదుగా నిర్ణయంచిన ప్రకారం డిసెంబరు 16,17 తేదీల్లో సమ్మె యథాతథంగా జరుగుతుందని ఎఐటియుసి అనుబంధ అఖిభారత బ్యాంకు ఉద్యోగు ల సంఘం (ఎఐబిఇఎ) ప్రకటించింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల ఐక్య వేదిక (యుఎఫ్‌బియు) ఈ సమ్మెకు పిలుపు ఇచ్చింది. బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిదులు ఇండియన్‌ బ్యాంక్స్‌, అసోసియేషన్‌,ఆర్థిక మంత్రిత్వశాఖలు ఈ చర్చల్లో పాల్గొన్నాయి. తమ వైఖరిలో మార్పు లేదని, బ్యాంకకుల ప్రైవేటీకరణ బిలు 2021 ్లను తక్షణం ప్రభుత్వం ఉపసంహరించుకోవాలన్న తమ డిమాండ్లకే కట్టుబడి ఉన్నామని ఎఐబిఇఎ ప్రధాన కార్యదర్శి సిహెచ్‌.వెంకటాచలం చెప్పారు. ఈ పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సమాయత్తమవుతోందన్నారు. ఒకవేళ అలా చేయకపోతే సమ్మె విషయంలో తమ ఉద్దేశాన్ని పునరాలోచిస్తామన్నారు. కానీ ప్రభుత్వం తమకు అలాంటి హామీ ఎక్కడా ఇవ్వలేదని అం దువల్ల సమ్మె యథాతథంగా జరుగుతుందని ఆయన స్పష్టం చేశారు. మేం మా శక్తివంచన లేకుండాప్రయత్నాలు చేశాం, ప్రజలకు ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూసేందుకు శాయశక్తులా కృషి చేశాం, కాననీ ప్రభుత్వం ముందుకు రాలేదు, అందువల్లనే సమ్మె పిలుపును మేం అమలుచేయాలనే నిర్ణయంచాం అని వెంకటాచలం చెప్పారు. ప్రజల ప్రయోనాలు నెరవేర్చడానికి, ప్రభుత్వ పథకాలు గ్రామ గ్రామానా సక్రమంగా అమలు కావడానికి ఉపయోగపడే ప్రభుత్వరంగ బ్యాంకులను రక్షించడం, ప్రైవేటీకణ చేయకుండా చూడటమే ఈ రెండు రోజుల సమ్మె పిలుపు ప్రధాన ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ఖాతాదారులు, బ్యాంకు వినియోగదారులు ఈ విషయం అర్థం చేసుకోవాలని, బ్యాంకు ఉద్యోగులకు దేశ ప్రయోజనాల రీత్యా సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. కాగా అదనపు ముఖ్య కార్మిక కమిషనర్‌తో జరిగిన బ్యాంకు ఉద్యోగ సంఘాల ప్రతినిధుల చర్చలు విఫలమయ్యాయని, సమ్మెకే మొగ్గు చూపామని అఖిల భారత బ్యాంకు ఆఫీసర్ల సమాఖ్య (ఎఐబిఓఎసి) ప్రధాన కార్యదర్శి సౌమ్య దత్తా చెప్పారు. 2021 బడ్జెట్‌లో ప్రభుత్వరంగ బ్యాంకులు రెండింటిని ఈ ఆర్థిక సంవత్సరంలోనే ప్రైవేటీకరణ చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఎఐబిఓసి, ఎఐబిఇఎ, ఎన్‌ఓబిడబ్ల్యు (బ్యాంకు వర్కర్ల జాతీయ సంఘం) లతో సహా తొమ్మిది బ్యాంకు ఉద్యోగ సంఘాలు యుఎఫ్‌బియు వేదికలో భాగస్వాములుగా ఉన్నాయి. యుఎఫ్‌బియు కన్వీనర్‌ (మహారాష్ట్ర) దేవీదాస్‌ తుల్జాపుర్కార్‌ మాట్లాడుతూ, వివిధ ప్రభుత్వ బ్యాంకులకు చెందిన తొమ్మిదిలక్షలమంది ఉద్యోగులు, ఆఫీసర్లు, వర్కర్లు, స్వీపర్లు గురు, శుక్రవారాల్లో అనివార్యంగా సమ్మెకు వెళ్ళవలసి వచ్చిందన్నారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో గ్రామాల్లో సేవలు అందించడంలో ప్రభుత్వరంగ బ్యాంకులు ఎల్లప్పుడూ ముందుపీఠిన నిలబడతాయన్న విషయం ప్రభుత్వం గుర్తించాలని కోరారు. జనధన్‌ యోజన, డీమోనిటైజేషన్‌, సామాజికరంగంలో ఉన్న బీమా పథకాలు, ముద్రా పథకాలు వంటి అన్నింటినీ ప్రభుత్వరంగ బ్యాంకులే అమలు చేస్తున్నాయని అన్నారు. మహారాష్ట్రలో 60 వేల మంది బ్యాంకు సిబ్బంది గురు, శుక్రవారాల్లో సమ్మెలో పాల్గొంటారన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments