23న సమావేశం రద్దు.. 4న చర్చలకు రావాలని ఆహ్వానం
తొలుత చర్చల ప్రక్రియను ఉపసంహరించుకుని మరో ఉత్తర్వును జారీ చేసిన కార్మిక శాఖ
ప్రజాపక్షం/హైదరాబాద్ : సమ్మె నోటీసు ఇచ్చిన ఆర్‌టిసి కార్మిక సంఘాలతో చర్చలు జరిపే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గందరగోళానికి గురి చేస్తున్నది. ఈ నెల 23వ తేదీన చర్చలకు రావాలని ఆహ్వానించిన, సంప్రదింపులు జరిపిన అధికారికి ఇచ్చిన అధికారాలను ఉపసంహరించి ఆ సమావేశాన్ని రద్దు చేసింది. కార్మిక సంఘాలు సమ్మెకు సన్నద్దమవుతుండగా తిరిగి ఆ అధికారికి అధికారాలను ఇస్తూ శుక్రవారం మరో ఉత్తర్వును జారీ చేస్తూ కార్మిక సంఘాలు అక్టోబర్ 4వ తేదీన చర్చలకు రావాలని ఆహ్వానించింది. ఈ మేరకు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానిస్తూ కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఇ.గంగాధర్ ఒక లేఖను పంపారు. కార్మికుల సమస్యలపై సంప్రదింపుల ప్రక్రియను ప్రారంభించనున్నట్లు తెలియజేసింది. దసరా పండుగకు ముందే కార్మికులు సమ్మెకు వెళ్లేందుకు సిద్ధమవుతుండడంతో కార్మిక శాఖ ఈ చర్యలు చేపట్టింది.
చర్చలను వాయిదా వేయడానికి కారణాలేంటి?
ఇయు- ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి : కార్మిక సంఘాలతో చర్చలను వాయిదా వేయడానికి గల కారణాలు ఏమిటని టిఎస్ ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కె.రాజిరెడ్డి ప్రశ్నించారు. కార్మిక వర్గాన్ని, ప్రజలను ప్రభుత్వం గందరగోళా నికి గురి చేస్తోందన్నా రు. చర్చలకు అధికారిని ఉపసంహరించి, తిరిగి నియమించడం ఏమిటని దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.