పెగాసస్‌పై మారని కేంద్రం మొండివైఖరి
నినాదాలు, నిరసనలతో హోరెత్తిన పార్లమెంటు
ఉభయ సభలు నేటికి వాయిదా
న్యూఢిల్లీ : పెగాసస్ నిఘా వ్యవహారంపై చర్చకు కేంద్రం ఏమాత్రం సానుకూలత వ్యక్తం చేయలేదు. పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో భా గంగా సోమవారం ఉదయం పదో రోజు సమావేశాలు ప్రారంభమైన వెంటనే ఉభయ సభల్లోనూ విపక్ష సభ్యులు పెగాసస్, మూడు సాగు చట్టాలు తదితర అంశాలపై చర్చకు డిమాండ్ చేశారు. దేశంలో కనీసం మూడు వందల మంది ప్రముఖు ల ఫోన్లను పెగాసస స్పైవేర్ ట్యాపింగ్ చేసిందని అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనాలపై పార్లమెంటు అట్టుడుకుతున్న విషయం తెలిసిం దే. రాజకీయ నాయకుల నుంచి న్యాయమూర్తుల వరకు, పారిశ్రామికవేత్తల నుంచి జర్నలిస్టుల వరకూ ఎంతో మంది నిఘా నీడన ఉన్నట్టు వచ్చి న వార్తల్లో నిజానిజాలు నిగ్గుతేల్చాలని ఈనెల 19న వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన రోజు నుంచి విపక్షాలు పట్టుబడుతునే ఉన్నాయి. అయితే, ప్రభుత్వం చర్చకు అంగీకరించడం లేదు. ఫలితంగా ఉభయ సభల్లోనూ ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఆందోళనను కొనసాగించడంతో వాయిదాల పర్వం కొనసాగుతున్నది. అర్థవంతమైన చర్చలేవీ జరగడం లేదు. పదోరోజు సెషన్స్‌లోనూ ఇదే పరిస్థితి పునరావృతమైంది. సభ్యుల ఆందోళనలు, నినాదాల మధ్యే ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని కొనసాగించారు. ‘జనరల్ ఇన్సూరెన్స్ బిజినెస్ (జాతీయీకరణ) సవరణ బిల్లు, 2021’ను లోక్‌సభ ఆమోదించింది. తద్వారా భారత బీమా రంగం నుంచి ప్రభుత్వ వాటాలను అమ్మేసే ప్రక్రియ వేగవంతం కానుంది. ఈ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం తలుపులు బార్లా తెరిచింది. పెగాసస్, సాగు చట్టాల రద్దు వంటి అంశాలపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానాలపై చర్చకు అనుమతించాలని అటు లోక్‌సభ, ఇటు రాజ్యసభలో ప్రతిపక్షాలు కోరుతున్నప్పటికీ స్పందించని మోడీ సర్కారు, బిల్లులకు ఆమోద ముద్ర వేయించుకోవడంలో మాత్రం వేగంగా స్పందిస్తున్నది. జనరల్ ఇన్సూరెన్స్ సవరణ బిల్లుకు ఆమోదం పొందడమే ఇందుకు నిదర్శనం. ఇలావుంటే, టోక్యో ఒలింపిక్స్ మహిళల బాడ్మింటన్ సింగిల్స్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న పివి సింధును పార్లమెంటు ఉభయ సభలు అభినందించాయి. రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని అందుకున్న ఆమె ఇప్పుడు మరో పతకాన్ని సాధించడం ద్వారా, రెండు ఒలింపిక్ పతకాలను గెల్చుకున్న తొలి భారత క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. పురుషుల విభాగంలో రెజ్లర్ సుశీల్ కుమార్ తప్ప ఇప్పటి వరకూ భారత అథ్లెట్లు ఎవరూ ఈ ఘనతను సాధించలేకపోయారు. అరుదైన రికార్డును తన పేరిట రాసుకున్న సింధుకు ప్రముఖులతోపాటు ప్రజలు కూడా జేజేలు పలుకుతున్నారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు తిరిగి ప్రారంభమయ్యే ఉభయ సభల్లో కార్యకపాలాలు సజావుగా సాగుతాయా అన్నది అనుమానంగానే కనిపిస్తున్నది.
చర్చకు ససేమిరా
RELATED ARTICLES