సాంకేతిక సమస్యలను సరిచేసే ప్రయత్నంలో ఇస్రో
శ్రీహరికోట(సూళ్లూరుపేట): సాంకేతిక సమస్యల కారణం గా చంద్రయాన్ ప్రయోగం ఆఖరి నిమిషంలో నిలిచిపోయిన నేపథ్యంలో వాటిని సరిచేసే ప్రయత్నంలో ఇస్రో తలమునకలైంది. దీర్ఘకాలం జాప్యం చేయకుండా ఈనెలలోనే చంద్రయాన్ 2 ప్రయోగాన్ని నిర్వహించాలని ఇస్రో శాస్త్రవేత్తలు పట్టుదలతో ఉన్నట్లు సమాచారం. చంద్రుడిపైకి భారత రెండో ప్రయోగం ‘చంద్రయాన్ సాంకేతిక సమస్య కారణంగా సోమవారం బ్లాస్ట్‌ఆఫ్ అయిన గంటలోపే నిలిపేసినట్లు భారతీయ రోదసి పరిశోధన సంస్థ(ఇస్రో) ప్రకటించిన విషయం తెలిసిందే. జిఎస్‌ఎల్‌వి ఎంకె రాకెట్ ద్వారా ప్రయోగించే చంద్రయాన్ కౌంట్‌డౌన్ ఉదయం 2.51కు మొదలయింది. కానీ ఆ కౌంట్‌డౌన్‌ను లిఫ్ట్‌ఆఫ్‌కు ముందు 56 నిమిషాల 24 సెకెండ్లకు …అంటే తెల్లవారు జామున 1.55 గంటలకు మిషన్ కంట్రోల్ సెంట్రల్ ప్రకటనను అనుసరించి ఆపేశారు. దాంతో అయోమయం నెలకొంది. ఆ తర్వాత ప్రయోగాన్నిరద్దు చేసినట్లు ఇస్రో ప్రకటించింది. ‘ప్రయోగ వాహక సిస్టంలో మైనస్56 నిమిషాలకు సాంకేతిక సమస్యను కనుగొన్నాం. చంద్రయాన్ తీసుకున్న అపార జాగ్రత్తల పరంగా ప్రయోగాన్ని ఆదివారం నిలిపేశాం’ అని ఇస్రో అసోసియేట్ డైరెక్టర్(పబ్లిక్ రిలేషన్స్) బిఆర్ గురుప్రసాద్ చెప్పారు. మార్చిన ప్రయోగ తేదీని తర్వాత ప్రకటిస్తామని కూడా ఆయన తెలిపారు. ఈ ప్రయోగాన్ని ముందు జనవరి మొదటి వారంలో చేపట్టాలని నిర్ణయించారు. కానీ తర్వాత దానిని జులై 15కు మార్చారు. చంద్రయాన్ ఆర్బిటర్‌తోపాటు, చంద్రుడి ఉపరితలంపై దిగే ల్యాండర్, రోవర్లు ఉన్నాయి. ఈ మూడు కాంపోనెంట్లు ఉన్న రోదసి వాహనం బరువు 3,850 కిలోలు. దీనిని శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ రోదసి కేంద్రం నుంచి ప్రయోగించాలనుకున్నారు. ప్రయోగాన్ని తిలకించడానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీహరికోటలో గడిపారు. చంద్రయాన్ ఇస్రో 2009 ఆగస్టు 29న విజయవంతంగా ప్రయోగించింది. అది 312 రోజులు పనిచేయడమేకాక, చంద్రుడి చుట్టూ 3,400 సార్లు భ్రమించింది. ఆ ప్రయోగం తర్వాత 11 ఏళ్లకు ఇస్రో చంద్రయాన్ ప్రయోగానికి సన్నద్ధమైంది. బాహుబలిగా మారుపేరుతో పిలిచే జిఎస్‌ఎల్‌వి రాకెట్ ద్వారా రూ. 978 కోట్లు విలువచేసే చంద్రయాన్ చంద్రుడిపై దిగడానికి 54 రోజులు తీసుకుంటుంది. గత వారం పూర్తి డ్రెస్ రిహార్సల్ చేశాక ఆదివారం తెల్లవారు జామున 6.51 ఉదయం మిషన్‌ను చేపట్టారు. శాస్త్రజ్ఞులు కూడా అన్ని దశలను పరిశీలించుకున్నారు. ఒకవేళ చంద్రయాన్ అనుకున్నట్లుగా చంద్రుడిపై దిగి ఉంటే రష్యా, అమెరికా, చైనా తర్వాత నాలుగో దేశంగా చరిత్రకెక్కేది. ప్రయోగాన్ని తిలకిద్దామని ప్రత్యేక గ్యాలరీలో కూర్చున్న పురుషులు, మహిళలు, బాలలు ప్రయోగం ఆగిపోవడంతో నిరాశతో వెనుతిరిగారు. కొన్ని నెలల క్రితమే ఈ ప్రత్యేక గ్యాలరీని ప్రేక్షకుల కోసం నిర్మించారు. ‘ఏమి జరిగిందో తెలియదు కానీ ప్రయోగం ఆగిపోయింది. మళ్లీ ప్రయోగించినప్పుడు వచ్చి చూస్తాను’ అని ప్రయోగాన్ని ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన ఓ బాలుడు అన్నాడు. ప్రయోగాన్ని చూడ్డానికి వచ్చిన ఓ వ్యక్తి ‘భూమి మీద రాకెట్ ఉండగానే దానిని ఆపేసి మంచిపనిచేశారు. అది నింగిలోకి వెళ్లి ఉంటే జరగరానిది జరిగి ఉండేది. ఈ మిషన్ కోసం వెచ్చించిన పెద్ద మొత్తం వృథా అయి ఉండేది’ అన్నారు.