ఆరుగురు దుర్మరణం
మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్‌లో ఘటన
ప్రజాపక్షం / మహబూబ్‌నగర్/ బాలానగర్ సంతలో కూరగాయాలు, సరుకులు కొనుగోలు చేసుకుని తిరుగు ప్రయాణంలో ఆటోలో వెళ్తుండగా డీసీఎం వాహనం అతివేగంగా ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. అదే సమయంలో బైక్ పై వెళ్తున్న మరొకరికి తీవ్ర గాయాలై ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న సంఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలో శుక్రవారం జరిగింది. శుక్రవారం బాలానగర్‌లో వారాంతపు సంత జరుగుతుండగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు తమ కావాల్సిన సరుకులను కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. మృతులంతా మండలంలోని మోతిఘనాపూర్ గ్రామానికి చెందిన వారని స్థానికులు చెప్పారు. మృతుల పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో చిన్న పిల్లలు సైతం మృత్యువాత పడటం ప్రజల్ని కలిసివేసింది. ఈ హృదయ విదారక దృశ్యాలు చూసి స్థానికులు బోరున విలపిస్తున్నారు. డీసీఎం వాహనం హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు వెళ్తుండగా చౌరస్తాపై ఆటోను అత్యంత వేగంగా ఢీ కొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ప్రస్తుతం శవాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ప్రమాదానికి కారణమైన డీసీఎం వాహనాన్ని ప్రజలు కోపోద్రికులై తగలబెట్టారు.
జవాన్ల వాహనం బోల్తా
ప్రజాపక్షం/భద్రాచలం ః ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో బిఎస్ఎఫ్ జనాన్లు ప్రయాణిస్తున్న 407 వాహనం అకస్మాత్తుగా పల్టీ కొట్టడంతో అందులోని 15 మందికి తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల ప్రకారం, సిజి రాష్ట్రంలోని నారాయణ్‌పూర్ జిల్లా , నారాయణ్‌పూర్ – అంతాగఢ్ మార్గంలో కుమ్హారీ గ్రామం వద్ద విధులకు వెళుతున్న క్రమంలో 407 వాహనం బోల్తా కొట్టింది. ఇందులో సుమారు 42 మంది జవాన్లు ప్రయాణిస్తున్నారు. ఈఘటనతో 15 మందికి గాయాలు అయ్యాయి, నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. దీంతో హుటాహుటిన హెలీకాప్టర్ రప్పించి క్షతగార్తులను రాయ్‌పూర్ హాస్పటల్‌కు తరలించి చికిత్సలు అందజేస్తున్నారు. ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఆస్పత్రికి చేరుకుని జవాన్లను పరామర్శించి వైద్యులతో మాట్లాడి మెరుగైన వైద్యసేవలు అందించాలని కోరారు.
ఘోర రోడ్డు ప్రమాదం
RELATED ARTICLES