హైదరాబాద్ : ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్‌ల వివాహ విందు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు హాజరయ్యారు. హెచ్.ఐ.సి.సిలో జరిగిన ఈ వేడుకలో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.రామారావు, హైదరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, సినీ నటులు నాగార్జున, అమల దంపతులు, సుధీర్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్, కళ్యాణ్, శ్రీజ దంపతులు, రాజకీయ ప్రముఖులు దానం నాగేందర్, పురందేశ్వరి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అశ్విని పొన్నప్ప పాల్గొని సందడి చేశారు.
ఘనంగా సైనా-కశ్యప్‌ల వివాహ విందు
RELATED ARTICLES