సర్కార్‌కు చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి : సిఎం కేసిఆర్ లేఖ
ప్రజాపక్షం / హైదరాబాద్ గ్రూప్- గ్రూప్- పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి ఉద్యోగాల భర్తీని పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సిఎం కెసిఆర్‌కు శనివా రం ఆయన లేఖ రాశారు. తెలంగాణ రాష్ర్టం ఏర్పడిన తర్వాత గ్రూప్- గ్రూప్- పోస్టులకు నోటిఫికేషన్‌లు విడుదల కాకపోవడంతో యువకులు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ర్టం వస్తే ఉద్యోగాలు వస్తాయనుకున్న యువకులకు నిరాశే మిగిలిందని పేర్కొన్నారు. అధిక డబ్బులు వెచ్చించి ప్రైవేటు శిక్షణా సంస్థలలో శిక్షణను పూర్తి చేసి దిక్కుతోచని స్థితిలో అయోమయంలో ఉన్నారన్నారు. చివరి సారిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో 2011లో గ్రూప్- నోటిఫికేషన్ 140 పోస్టులకు విడుదల చేశారని, ఆ తరువాత నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం, ఈ పోస్టులను భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులలో యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఫలితాలు విడుదల చేసినా ఉద్యోగాల భర్తీ చేయలేదన్నారు. వెంటనే గ్రూప్ గ్రూప్ నోటిఫికేషన్‌లు విడుదల చేసి ఆయా శాఖల ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని సిఎంకు రాసిన లేఖలో చాడ కోరారుకోరారు.
గ్రూప్-1, గ్రూప్-3 పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్
RELATED ARTICLES