గ్రామ వికాసానికి పాటుపడండి
కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌పర్సన్స్ సమావేశంలో సిఎం కెసిఆర్
పంచాయతీలకు అవసరమైనన్ని నిధులు కేటాయిస్తాం, ఖర్చుల తీరుపై ఆకస్మిక తనిఖీలు
ప్రజాపక్షం/హైదరాబాద్: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు వార్డు సభ్యులను, గ్రామ ప్రజలను కలుపుకుని సామూహికంగా గ్రామ వికాసానికి పాటుపడాలని ముఖ్యమంత్రి కెసిఆర్ పిలుపునిచ్చారు. కొత్తగా ఎన్నికైన సర్పం చ్‌లకు శిక్షణ ఇచ్చే రిసోర్స్‌పర్సన్స్ (మాస్టర్ ట్రైనీస్)తో బుధవారం ప్రగతిభవన్‌లో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. గ్రా మాలు వేదికగానే ప్రగతి ప్రణాళికలు అమలు కావాలని చెప్పారు. గ్రామ పంచాయతీలకు అవ సరమైనన్ని నిధులు, విధులు కేటాయిస్తామని తెలిపారు. సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా పనిచేయాలన్నారు. మంచినీటి సర ఫరా నేరుగా చేస్తున్నందున గ్రామాల్లో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత పాటించడం, వైకుంఠ ధామాల నిర్మాణాలపై ఎక్కువ దృష్టి పెట్టాల న్నారు. సర్పంచ్‌లను, కార్యదర్శులను చేంజ్ ఏజెంట్లుగా మార్చే బాధ్యతను రిసోర్స్ పర్సన్లు చేపట్టాలని చెప్పారు. గ్రామ పంచాయతీలకు అధి కారాలు, నిధులు బదిలీ చేసే విషయంలో అత్యం త ఉదారంగా ఉంటామని ఆయన స్పష్టం చేశారు. అయితే నిధుల దుర్వినియోగానికి పాల్పడినా, విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినా సర్పంచ్‌లను, గ్రామ కార్యదర్శులను సస్పెండ్ చేస్తామని చెప్పారు. దీనికి అనుగుణంగానే కఠిన చట్టాన్ని రూపొందించామన్నారు. సర్పంచ్‌లు అంకితభావంతో పనిచేయడానికి కావాల్సిన అవగాహనను, చైతన్యా న్ని కలిగించాలని తెలిపారు. ఇప్పుడు గ్రామం ఎక్కడుంది, అయిదేళ్ల తర్వాత ఎక్కడికి పోవాలి అనే విషయాలను నిర్దారించుకుని రంగంలోకి దిగాలన్నారు. పంచాయతీ పరిధిలోని వనరులు, అవసరాలను బేరీజు వేసుకుని దానికి అనుగుణంగా పనులు చేయాలన్నారు. ‘గ్రీన్ విలేజ్, క్లీన్ విలేజ్’ నినాదంతో గ్రామంలో పచ్చదనం, పారిశుద్ధ్య పరిరక్షణకు, స్మశాన వాటికల నిర్మాణాలకు, పన్నుల వసూలుకు మొదటి దఫాలో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు.