మైనారిటీలను రెచ్చగొట్టిన కాషాయ మూకలు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోల్‌కతా ర్యాలీలో ఉద్రిక్తం
కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో బిజెపి నిర్వహించిన ర్యాలీలో కొందరు ఆ పార్టీ కార్యకర్తలు ‘గోలీమారో’ నినాదాలు చేయడం కలకలం రేపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం కోల్‌కత్తాలో పర్యటించిన విషయం తెలిసిందే. అమిత్ షా రాక సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ ర్యాలీలో గోలీమారో నినాదాలు చేయడం గమనార్హం. బిజెపి కార్యాల యం నుంచి ప్రారంభమైన ర్యాలీలో తొలుత కార్యకర్తలు భారత్ మాతాకీ జై, జై శ్రీరాం నినాదాలు చేస్తూ ముందుకు కదిలారు. అయితే అమిత్‌షా పర్యటనను వ్యతిరేకిస్తూ ఆందోళన నిర్వహిస్తున్న ప్రతిపక్షాల పరిసర ప్రాంతాల్లోకి రాగానే బిజెపి కార్యకర్తలు ఒక్కసారిగా రెచ్చిపోయారు. వారు సమీపంలోకి రాగానే ‘గోలీమారో… గోలీమారో’ నినాదాలను చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారులు స్పందించారు. సిసి టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని, ఎవరు ఆ నినాదాలు చేసిన వారిపై చర్యలు