ప్రజాపక్షం/భద్రాచలం: భద్రాచలంలో పవిత్ర పావన నదీ తీరంలో సోమవారం రాత్రి గోదావరి నదికి మహా హారతి కార్యక్రమం కన్నుల పండువగా సాగింది. కార్తీక పౌర్ణమి సందర్భంగా నదులకు హారతులు ఇవ్వడం సంప్రదాయం. కార్తీక పౌర్ణమి రోజున దేవతలు దీపావళి వేడుకను జరుపుకుంటారు. ఈ సందర్భంగా పలు రకాల హారతులు పట్టారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఎంఎల్‌ఎ పొదెం వీరయ్య పాల్గొని మాట్లాడుతూ దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉందని, గోదావరి తీరంలో జన్మించడం ఈ ప్రాంత ప్రజల అదృష్టం అన్నారు. ఎఎస్‌పి రాజేష్ చంద్ర, శ్రీరామ్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ డైరెక్టర్స్ గాలి రాంబాబు, కందుల కొండలరావు, బూసిరెడ్డి శంకర్‌రెడ్డి, గాదె మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గోదావరికి ఘనంగా మహాహారతి
RELATED ARTICLES