గొర్రెలను అమ్మేసుకున్న 90 శాతం మంది లబ్ధిదారులు
వారి పేర్లపై ఇప్పుడు ఉచిత దాణా సంచులు
పశువైద్యులు, లబ్ధిదారులు కుమ్మక్కై ప్రైవేటు వ్యక్తులకు విక్రయం
ప్రజాపక్షం/హైదరాబాద్: గొర్రెల పంపిణీ లబ్ధిదారులకు ప్రభుత్వం సరఫరా చేస్తున్న ఉచిత దాణా పథకం పక్కదారి పడు తోంది. ఫలితంగా ఈ పథకం కోసం ప్రభుత్వం వెచ్చిస్తున్న కోట్లాది రూపాయలు దళారుల పాల వుతున్నాయి. ఏడాది కింద రాష్ట్ర ప్రభుత్వం గొర్రె ల పంపిణీ పథకం చేపట్టిన విషయం తెలిసిందే. అయితే నూటికి 90 శాతం లబ్ధిదారులు తమకు గొర్రెలు వచ్చిన నెల రోజుల్లోనే మార్కెట్లో అమ్మే సుకున్నారు. ప్రస్తుతం లబ్ధిదారుల వద్ద ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు లేవు. కేవలం 10 నుంచి 15 శా తం వరకు లబ్ధిదారుల వద్దనే గొర్రెలు ఉన్నాయి. గొర్రెలకు పౌష్టికాహారం కోసం ప్రభుత్వం ప్రతి లబ్దిదారుడికి ఉచితంగా 200 కిలోల (నాలుగు 50 కిలోల సంచులు) దాణా ఇవ్వాలని నిర్ణయిం చింది. ఈ దాణాలో మక్కపిండి, బెల్లం, తౌడు, ఇతరత్రా కాల్షియం కలిగిన దాణా ఉంటుంది. ప్రతి లబ్దిదారుడికి ఈ దాణాను ఉచితంగా అం దించేందుకు ప్రభుత్వం గ్రామాలలోని పశువైద్య శాఖకు టన్నుల కొద్ది దాణా సంచులను తరలిం చారు. ఇంత వరకు బాగానే ఉంది. అయితే చాలా మంది లబ్దిదారుల వద్ద ఇప్పుడు గొర్రెలు లేవు. వారు అమ్ముకున్నారు. మిగిలిన గిర్రెలు చనిపోయాయి. ఉన్న నాలుగైదు గొర్రెలు మేపడానికి వీలుకాక వాటిని సైతం మార్కెట్లో అమ్ముకున్నారు. ఇక నూటికి 15 శాతం లబ్దిదారుల వద్ద మాత్రం ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు ఉన్నాయి. వీరు మాత్రం తమ పేర్లపై వచ్చిన ఉచిత దాణా సంచులను తీసుకెళ్తున్నారు. ఇక 85 శాతం మంది లబ్దిదారుల వద్ద అసలు గొర్రెలే లేవు. అయినా వీరి పేర్లపై కూడా ఉచిత దాణా సంచులు వచ్చాయి. లబ్దిదారుల వద్ద గొర్రెలు ఉంటేనే దాణా సంచులు ఇవ్వాలని స్థానిక పశువైద్యశాఖ డాక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. అయితే ఇక్కడే తిరకారు వచ్చిపడింది. గొర్రెలు లేకున్నా ఉన్నట్లు వైద్యలు నిర్ధారించి వారి పేర్లపై వచ్చిన ఉచిత దాణా సంచులను లబ్దిదారుల సహకారంతో ప్రైవేటు మార్కెట్‌కు విక్రయిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పెద్దమొత్తంలో వందల టన్నుల కొద్ది దాణా సంచులు మార్కెట్లో ప్రైవేటు డెయిరీ ఫారం, గొర్రెల ఫారాల వారికి అమ్ముకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.నిజానికి మండ ల పశువైద్యశాఖ డాక్టర్ లబ్దిదారుల వద్దకు వెళ్లి గొర్రెలను తనిఖీ చేయాలి. వారి వద్ద ప్రభుత్వం ఇచ్చిన గొర్రెలు లేకపోతే పై అధికారులకు ఈ విషయాన్ని తెలియజేయాలి. ఒక్కో మండలంలో ఎంత మంది లబ్దిదారులు ఉన్నారు. వారిలో ప్రస్తుతం ఎంత మంది దగ్గర గొర్రెలు ఉన్నాయనే వాస్త వ రిపోర్టును జిల్లా కలెక్టర్లకు అందించాలి. అయితే పశువైద్య శాఖ డాక్టర్లు అలా చేయకుండా లబ్దిదారులతో మిలాఖతై వారి పేర్లపై వచ్చిన దాణా సంచులను పక్కదారి పట్టిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఇలా రాష్ట్ర వ్యాప్త ంగా 31 జిల్లాలో వేలాది లబ్దిదారుల పేర్లపై వచ్చిన దాణా సంచులను విక్రయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గత ఏడాది గొర్రెల పంపిణి పథకం కింద ఎంపికైన లబ్దిదారుడు ప్రభుత్వానికి రూ. 31,250 డిడి కట్టాడు. ఈ మేరకు ప్రభుత్వం మిగతా డబ్బులు వేసి లబ్దిదారుడికి 21 (ఒక మగ గొర్రె)గొర్రెలను ఇచ్చింది. ఈ గొర్రెలు ఈ సమయంలో గర్భం దాల్చాల్సి ఉంది.అయితే వాటికి బలమైన ఆహారం పెడితే మరింత ఆరోగ్యకరంగా గొర్రెలు ఉంటాయని ప్రభుత్వం వారికి ఉచిత దాణా పథకం అమ లు చేసింది.ఈ పథకం పక్కదారి పడుతుండడంతో పశువైద్యశాఖ డాక్టర్లపై పలు ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికైనా ఆయా జిల్లాల కలెక్టర్లు స్పం దించి గొర్రెల పథకం కింద లబ్ది పొందిన లబ్దిదారుల వివరాలను సేకరిం చి, ప్రస్తుతం ఎవరెవరి వద్ద గొర్రెలు లేవు అనే వివరాలను కూడా కూలంకశంగా తెప్పించుకుని పరిశీలిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. గొర్రెలు లేని వారికి కూడా ఉచిత దాణా సంచులుఇవ్వడం పై పలువురు ముక్కున వేలేసుకుంటున్నారు. ఉచిత దాణా పథకం పక్కదా రి పడకుండా జిల్లా కలెక్టర్లు ఇప్పటికైనా మేల్కోనాలని వారు కోరుతున్నా రు.