HomeEntertainmentCinemaగేమ్‌ ఛేంజర్‌ లేటెస్ట్‌ అప్డేట్‌!

గేమ్‌ ఛేంజర్‌ లేటెస్ట్‌ అప్డేట్‌!

మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా, కోలీవు్‌డ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్టైనర్‌ గేమ్‌ ఛేంజర్‌, తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఈ చిత్రం ఈ డిసెంబర్‌ నెలలో రిలీజ్‌ చేయనున్నట్లు ప్రొడ్యూసర్‌ దిల్‌ రాజు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇంకా రిలీజ్‌ డేట్‌ పై క్లారిటీ రాలేదు. అయితే ఈ చిత్రం షూటింగ్‌ ఇంకా బ్యాలెన్స్‌ ఉండటం కూడా అభిమానులని కలవర పెడుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్‌ రేపటి నుండి సిరిసిల్ల లో జరగనుంది. ఎస్‌ జే సూర్య, శ్రీకాంత్‌ మరికొందరు కీలక నటీనటుల పైన షూటింగ్‌ జరగనుంది. ఇక ఈ చిత్రంలో కియారా అద్వానీ, అంజలి లు ఫీమేల్‌ లీ్‌డ రోల్స్‌ లో నటిస్తున్నారు. మ్యూజికల్‌ సెన్సేషన్‌ థమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments