నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐ డిమాండ్
హింస, అగ్నిప్రమాదాల బాధితులకు నష్టపరిహారం ఇవ్వాలి
రాష్ట్రంలో సాధారణ స్థితిని, శాంతిని పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలి
హర్యానాలో పర్యటించిన సిపిఐ ప్రతినిధి బృందం
అడ్డుకున్న పోలీసు బలగాలు
హర్యానా : హర్యానాలోని గురుగ్రామ్, నుహ్‌లో అల్లర్లకు దారితీసిన సంఘటనల తీరుపై సమగ్ర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలని సిపిఐ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. హింస, అగ్నిప్రమాదాల బాధితులకు ఉదారంగా నష్టపరిహారం ఇవ్వాలని, రాష్ట్రంలో సాధారణ స్థితిని, శాంతిని పునరుద్ధరించేందుకు, ఈ ప్రాంతం ప్రజల మధ్య ఐక్యతను సాధించేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది. హర్యానాలోని గురుగ్రామ్, నుహ్‌లోని ని హింసాకాండ ప్రభావిత ప్రాంతాలను సందర్శించి వాస్తవాలను తెలుసుకునేందుకు, బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) నేతల ప్రతినిధి బృందాన్ని ఆదివారం పోలీసులు అడ్డుకున్నారు. సిపిఐ రాజ్యసబ పక్ష నేత బినోయ్ విశ్వం, ఎఐటియుసి ప్రధాన కార్యదర్శి అమర్‌జీత్ కౌర్, సిపిఐ ఎంపి పి.సందోష్ కుమార్, సిపిఐ హర్యానా కార్యదర్శి దరియావో సింగ్ కశ్యప్ సిపిఐ ప్రతినిధి బృందంలో ఉన్నారు. ఇదిలా ఉండగా అల్లర్లు జరుగుతున్న ప్రాంతంలో సిఆర్‌పిసి సెక్షన్ 144 కింద నిషేధాలు అమలులో ఉన్నందున ప్రతినిధి బృందాన్ని అనుమతించలేదని, ప్రతినిధి బృందానికి భద్రతాపరమైన సమస్యలు కూడా తలెత్తే ప్రమాదం కూడా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. “హింసాత్మకంగా దెబ్బతిన్న హర్యానా లో భయంకరమైన స్థాయిలో ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారు. ఈ ప్రాంతంలో కలహాలకు ఆజ్యం పోసేందుకు ఉద్దేశపూర్వకంగా ప్రయత్నాలు జరుగుతున్నాయయి. బలవంతపు సామూహిక వలసలు జరుగుతున్నాయి” అని హర్యానాలోని హింసాత్మక ప్రాంతాలను సందర్శించి వివిధ వర్గాల వారితో చర్చించిన సిపిఐ ప్రతినిధి బృందం తెలియజేసింది. బిజెపి పాలనలో క్రమపద్ధతిలో మైనారిటీలపై వ్యవస్థీకృత వివక్షత పెంచబడుతున్నదనే చేదు వాస్తవాన్ని రివారీ హర్యానాలోని దహీనా బ్లాక్ జైనాబాద్ పంచాయతీ సర్పంచ్ పేరుతో ఉన్న ఒక లేఖ బహిర్గతం చేస్తుంది” అని సిపిఐ ప్రతినిధి బృందం నేతలు తెలిపారు. లేఖలోని అంశాలు దిగ్భ్రాంతిని కలిగిస్తున్నాయని సిపిఐ నేతలు పేర్కొన్నారు. పంచాయితీ ప్రాంతంలో ముస్లింలు లేదా అక్రమార్కులు ఎలాంటి వ్యాపారం లేదా వాణిజ్య కార్యకలాపాలు చేయకూడదనే నిర్ణయాన్ని స్థానిక పోలీసు అధికారులకు లేఖను సమర్పించినట్లు తెలిపారు. ఇది ముస్లింలను దొంగలు, పశువుల దొంగలతో సమానంగా భావించబడుతుందన్నారు. గ్రామంలో శాంతిని నెలకొల్పేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నామని, మతపరమైన విధ్వంసానికి ఏకైక ముస్లింల ఉనికి కారణమని లేఖలో పేర్కొన్నారన్నారు. ఈ ప్రాంతంలో సామూహిక వలసలు బలవంతం చేయబడుతున్నాయని, ద్వేషం, విభజన రాజకీయాలతో మతసామరస్యం పతనమౌతున్నదని నేతలు తెలిపారు.వీటితో పాటు బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్ చేపడుతున్న హిందువులత ఏకీకరణ చర్యలు ఈ పర్యటనలో సిపిఐ ప్రతినిధి బృందం దృష్టికి వచ్చాయని తెలిపారు. ఈ ప్రాంతంలో ద్వేషం, విభజనలు పెరగడం క్రమపద్ధతిలో జరుగుతున్నదని, రెండు వర్గాల మధ్య కలహాలకు ఉద్దేశ్యపూర్వకంగా బీజాలు నాటబడుతున్నాయని వారు చెప్పారు. ఈ ప్రాంతంలో శాంతి, సామరస్యం నెలకొనాలని ప్రతినిధి బృందం సభ్యులు కలిసిన వారందరికీ విజ్ఞప్తి చేశారు. నుహ్‌లోని ప్రవేశించకుండా పోలీసులు అడ్డుకోవడంపై సిపిఐ ఎంపి బినోయ్ విశ్వం మాట్లాడుతూ ‘సిపిఐ ప్రతినిధి బృందాన్ని హర్యానాలోని నుహ్‌లోకి ప్రవేశించకుండా పోలీసు బలగాలు అడ్డుకోవడం గర్హనీయం. “పోకిరీలు, గూండాలు, దుర్మార్గులు స్వేచ్ఛగా వెళ్లవచ్చు. శాంతిభద్రతల కోసం ఇక్కడికి వచ్చిన ప్రజాస్వామ్యవాదులను పోలీసులు అడ్డుకున్నారు. హింసా బాధితులను కలుసుకుని శాంతి కోసం విజ్ఞప్తి చేయడం మా ఉద్దేశం. ప్రజలు స్వేచ్ఛాగా ఉండడాన్ని చూసి డబుల్ ఇంజిన్ కేంద్ర ప్రభుత్వం కూడా భయపడుతోంది. ఎన్నికలే లక్ష్యంగా ప్రజలను విభజించడమే వారి ప్రణాళిక బిజెపి ప్రభుత్వ లక్ష్యం. తాము ఎలాంటి ఘర్షణలను కోరుకోవడంలేదు. కాబట్టి మేము వెనక్కి వెళ్లాలని నిర్ణయించుకున్నాం” అని బిస్వామ్ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా నుహ్ జిల్లాలో జూలై 31న విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునే ప్రయత్నంలో హింస చెలరేగగా, ఇందులో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. హింస గురుగ్రామ్‌తో పాటు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. పోలీసులు ఇప్పటివరకు 200 మందికి పైగా అరెస్టు చేయగా, సుమారు 80 మందిని ముందస్తు నిర్బంధంలోకి తీసుకున్నారు. అధికారిక ఉత్తర్వు ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వం శనివారం నూహ్‌లో మొబైల్, ఇంటర్‌నెట్, ఎస్‌ఎంఎస్ సేవలను ఈ నెల 8వ తేదీ వరకు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
గురుగ్రామ్, నుహ్ ఘటనలపైసమగ్ర విచారణ
RELATED ARTICLES