ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దుతాం
అవసరమైన నిధులను సమకూర్చుతాం
పెద్దాపూర్ ఘటన తీవ్రంగా బాధించింది
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ప్రజాపక్షం / మెట్ పల్లి
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేసి వాటి ప్రాంగణాలను అత్యంత పరిశుభ్రతగా తీర్చిదిద్దడంతో పాటు అవసరమైన నిధులను సమకూర్చుతామని, మౌలిక వసతులు కల్పించడం తో పాటు వాటి రక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకుంటామని డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క వెల్లడించారు, జగిత్యాల జిల్లా, మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గురకుల పాఠశాలను మంగళవారం బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి భట్టి విక్రమార్క సందర్మించారు, గురుకుల పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థుల గణాదిత్య, అనిరుధ్ మరణంతో పాటు నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురికావడం తీవ్రంగా బాధించిందన్నారు. బాధితుల తల్లిదండ్రులను పరామర్మించారు. వారి రెసిడెన్స్ పరిధిలో బాధిత కుటుంబాల్లో
ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించి అదుకుంటామని హామీనిచ్చారు, పాఠశాలలో ఉన్న వసతులు ఇతరత్రా మౌలిక సదుపాయాలను గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సిఎం మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వంలో బడ్జెట్ పెట్టడానికి విద్య, మైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సాధించి ఈ వార్షిక బడ్జెట్ పెద్ద ఎత్తున నిధులు కేటాయించినట్లు తెలిపారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గురుకుల పాఠశాలలు పక్క భవనాల నిర్మాణం కోసం ఈ బడ్జెట్ ప్రజా ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించిందన్నారు. గత ప్రభుత్వ నిర్లక్షం ఫలితంగా అరకొర వసతుల మధ్య నేడు విద్యార్థులు దుర్భర పరిస్థితులు అనుభవిస్తున్నారన్నారు. ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే మానవ వనరులను అభివృద్ధి చేసుకోవాలని, ప్రపంచంతో పోటీపడే విద్యను అందించాలని విద్యకు పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ముందుకుళ్తున్న తరుణంలో పెద్దాపూర్ ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం ప్రజా ప్రభుత్వాన్ని తీవ్రంగా కలిచిసివేసిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాల్లో పక్క భవనాల నిర్మాణం కోసం కావలసిన నిధులు, భవనాల నిర్మాణ కావసిన స్థల సేకరణకు అయ్యే నిధులకు సంబంధించి ప్రతిపాదనలు పంపాలని గత కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు. 2004 నుంచి 2014 వరకు ప్రభుత్వ హస్టల్స్ చదివే విద్యార్థులకు హెల్త్ కార్డ్ ఉండేవని, ప్రతి నెల డాక్టర్లు వచ్చి వారి ఆరోగ్యాన్ని చెక్ చేసి కార్డులో రాసే వారని గుర్తు చేశారు. అదేవిధంగా ప్రభుత్వ హాస్టళ్లలోనే పారామెడికల్ స్టాఫ్ ఉండేవారని ఆ విధానాన్ని తిరిగి తీసుకురావాలని గురకులాల సెక్రటరీని ఆదేశించారు.
డైట్ చార్జీల పెంపునకు కమిటీ వేస్తాం……
పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా డైట్ చార్జీలు పెంచడానికి త్వరలోనే అధికారులతో కమిటీ వేస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత డైట్ పెంచుతామని వెల్లడించారు. ఇజిఎస్ పనుల కింద గురకుల పాఠశాలలో చెత్త, చెదారం, పిచ్చి మొక్కలు తొలగించి పండ్లు ఔషధ మొక్కలు నాటించాలని గురుకులాల సెక్రటరీ రమణ కుమార్ ఆదేశించారు.
పెద్దాపూర్ పాఠశాలకు 50 లక్షలు మంజూరు…..
పెద్దాపూర్ గురుకుల పాఠశాల ప్రాంగణంలో నీటి కుంటలు, చెత్తా, చెదారం, లెకుండా అభివృద్ధి చేయడానికి, టాయిలెట్స్ నిర్మాణం, ఇతర సౌకర్యాలు కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50 లక్షలు మంజూరు చేశామని ఉమ్మడి కరీంనగర్ ఎంఎల్ జీవన్ రెడ్డి అన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా డార్మీటరీ, డైనింగ్ హాల్స్ భవన నిర్మాణం కోసం ప్రతి పాదనలు పంపించిన వెంటనే ఒక్కరోజు ఆలస్యం చేయకుండా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర కల్వకుంట్ల సంజయ్ కుమార్, కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జ్ జువ్వాడి నర్సగ్ రావు, జల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ తో పాలు ఇతర అధికారులు తదితరులు పాల్గోన్నారు,
గురుకులాలను ప్రక్షాళన చేస్తాం
RELATED ARTICLES