అత్యధికంగా వెదజల్లుతున్న నాలుగో దేశం భారత్
న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధికంగా బొగ్గుపులుసు వాయువు(కార్బన్‌డైయాక్సైడ్)ను వెదజల్లుతున్న నాలుగో దేశం భారత్. 2017 ప్రపంచ ఉద్గారాల లెక్కప్రకారం 7% కార్బన్‌డైయాక్సైడ్‌ను వెదజల్లుతోంది. ఈ విషయాన్ని బుధవారం ‘ది గ్లోబల్ కార్బన్ ప్రాజెక్ట్’అధ్యయనం వెల్లడించింది. ప్రపంచంలో 58% ఉద్గారాలను వెదజల్లుతున్న దేశాలు చైనా (27%), అ మెరికా(15%), యూరోపియన్ యూనియన్ (10%), భారత్( 7%). ప్రపంచంలోని మిగిలిన దేశాల న్నీ కలిపి 41% ఉద్గారాలను వెదజల్లుతున్నాయి. టాప్ 10లో ఇవేకాక రష్యా, జపాన్, జర్మనీ, ఇరాన్, సౌదీ అరేబి యా, దక్షిణ కొరియా ఉన్నాయి. భారత్ లో ఇప్పటికీ బొగ్గు ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రపంచంలో ఇప్పటికీ చైనా, భారత్ బొగ్గుపైనే ఎక్కువ ఆధారపడుతున్నాయని అధ్యయనంలో తెలింది. అమెరికా, యూరోపియన్ యూనియన్‌లు క్రమంగా కర్బన ఉద్గారాన్ని తగ్గించుకుంటున్నాయి. బొగ్గు వినియోగాన్ని త గ్గించుకొనేందుకు భారత్ కూడా సౌర సంస్థలను నెలకొల్పుతోంది. 2020 నా టికీ శిలాజ ఇంధనాన్ని వదిలించుకునేందుకు భారత్ సన్నద్ధమవుతోందని ఆ అధ్యయనం వెల్లడించింది.
గుప్పుమంటోన్న co2
RELATED ARTICLES