HomeNewsBreaking Newsగుడిసె వాసులకు పట్టాలిలపై అసెంబ్లీలో చర్చించండి

గుడిసె వాసులకు పట్టాలిలపై అసెంబ్లీలో చర్చించండి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు
ప్రజాపక్షం / జయశంకర్‌ భూపాలపల్లి ప్రతినిధి ః
భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 280 సర్వేనెంబర్‌లో నల్ల చెరువు శిఖం భూమిలో సిపిఐ పార్టీ ఆద్వర్యంలో గుడిసెలు వేసుకొని నివాసం ఉంటున్న గుడిసె వాసులందరికి ప్రభుత్వం వెంటనే పట్టాలివ్వాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కెల్లపల్లి శ్రీనివాస రావు డిమాండ్‌ చేశారు. గురువారం కారల్‌ మార్క కాలనీలో ని సర్వేనెంబర్‌ 280లో సుమారు 22 ఎకరాల ప్రభుత్వ భూమిలో 4000వేల మంది పేదలు గుడిసెలు వేసుకున్నారు. భూ పోరాటంలో వేలాది మంది ప్రజలు తరలి వచ్చి గుడిసెలు వేసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. గుడిసె సెంటర్‌ జనాలతో కిక్కిరిసి పోతుంది. చిన్న పాటి మేడారం జాతరను తలపిస్తుంది. ఈ గుడిసె సెంటర్‌ ను శ్రీనివాస రావు సందర్శించారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో శ్రీనివాసరావు పాల్గోని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదల కోసం జీవో నెంబర్‌ 58 ద్వారా ఇంటి స్థలాలు కేటాయించి ఇంటి నిర్మాణం కోసం 3లక్షల రూపాయలు ఇస్తానని నిండు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిందని,ఇప్పటి వరకు ఏ ఒక్కరికి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇల్లు నివాస స్థలాలు ఇవ్వలేదని అన్నారు.గత ఎనిమిది సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హమీలను నెరవేర్చలేదని చేసేది ఏమిలేక సిపిఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా భూ పోరాటం నిర్వహించడం జరిగిందని తెలిపారు.అందులో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా అనేక మంది పేదలు గుడిసెలు వేసుకున్నారని తెలిపారు.ప్రభుత్వం ఇప్పటికైన పేదప్రజల పట్ల చిత్త శుద్ది ఉంటే అసెంబ్లీలో చర్చజరిపి గుడిసెలు వేసుకున్న పేదలందరికి పట్టాలు ఇవ్వాలని శ్రీనివాస రావు డిమాండ్‌ చేశారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మాణం పూర్తి చేసుకున్న 967 డబుల్‌ బెడ్‌ రూమ్‌లు ఇంత వరకు ఏ ఒక్కరికి ఇవ్వలేదని , డబుల్‌ బెడ్రూమ్‌లు ఇవ్వలేద న్నారు. జిల్లా కేంద్రంలో పేదల కోసం సిపిఐ రాష్ట్ర పార్టీ పిలుపులో భాగంగానే భూ పోరాటం నిర్వహిస్తున్నమన్నారు. ఈ భూ పోరాటం 16వ రోజుకు చేరుకుందని పేదలకు భూములు పంచేవరకు సిపిఐ పార్టీ వారికి అండగా ఉంటుందని తెలిపారు. గతంలో సిపిఐ ఆద్వర్యంలో భూములు పంచిన చరిత్ర ఉందని భూపాలపల్లి జిల్లా కేంద్రంలో సిఆర్‌ నగర్‌ బాంబుల గడ్డ , కారల్‌ మార్కకాలనీలు లో 20 సంవత్సరాల క్రితం సిపిఐ పార్టీ ఆద్వర్యంలో భూ పోరాటం పలితంగానే కాలనీలు ఏర్పాటు చేసి ఎంతో మందికి అండగా పార్టీ నిలిచిందని అన్నారు. ఇప్పుడు కూడ 280 సర్వేనెంబర్లో గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇచ్చేంతవరకు పోరాటం నిర్వహిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాల కార్యదర్శులు మాజీ ఎమ్మెల్యే సిహెచ్‌ రాజా రెడ్డి,బి విజయ సారధి,మేకల రవి,కర్రె బిక్షపతి,తోట మల్లి ఖార్జున్‌ రావు,సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యులు పంజాల రమేష్‌,ఎస్‌కె బాష్‌ మియా,దండు లక్ష్మణ్‌,భూపాలపల్లి జిల్లా కార్యవర్గ సభ్యులు కొరిమి సుగుణ,మోటపలుకుల రమేష్‌,క్యాతరాజ్‌ సతీష్‌,సొత్కు ప్రవీణ్‌ కుమార్‌,కుడుదుల వెంకటేష్‌,జోసఫ్‌,శ్రీకాంత్‌,రాజేశ్వరి తదితరులు పాల్గోన్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments