అహదాబాద్ : గుజరాత్ ముఖ్యమంత్రిగా భూపేంద్ర పటేల్‌ను ఆ రాష్ట్ర బిజెపి శాసన సభా పక్షం ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ఆ వెంటనే గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌ను కలిసిన భూపేంద్ర తనకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని కోరుతూ లేఖను అందచేశారు. దీనితో గుజరాత్ కొత్త ముఖ్యమంత్రిగా భూపేంద్ర పగ్గాలు స్వీకరించడం లాంఛనం కానుంది. ముఖ్యమంత్రికి విజయ్ రూపాన అనూహ్యంగా తెరపైకి వచ్చిన పేరు
మంత్రిగా కూడా అనుభవం లేకపోయినా
ఏకంగా ముఖ్యమంత్రిగా ఛాన్స్
అనూహ్యంగా రాజీనామా చేయడంతో, తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్న ఉత్కంఠ తలెత్తింది. సిఎం రేసులో గుజరాత్ డిప్యూటీ సిఎం నితిన్ పటేల్, వ్యవసాయ మంత్రి ఆర్‌సి ఫల్దు, కేంద్ర మంత్రులు పురుషోత్తమ్ రూపాలా, మన్‌సుఖ్ మాండవీయ ఉన్నట్టు వార్తలు కూడా వచ్చాయి. కానీ, ఆదివారం బిజెపి గుజరాత్ శాఖ కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ ఎంఎల్‌ఎల సమావేశంలో ఎవరూ ఊహించని విధంగా భూపేంద్ర పేరు తెరపైకి వచ్చింది. పార్టీ అధిష్టానమే నేరుగా ఆయన పేరును ఖరారు చేయడంతో, ఎంఎల్‌ఎలు ఏకగ్రీవంగా ఆయనను నాయకుడిగా ఎన్నుకుంటూ తీర్మానాన్ని ఆమోదించారు. ఈ సమావేశానికి పరిశీలకులుగా వ్యవహరించిన కేంద్ర మంత్రులు నరేంద్ర సింగ్ తోమర్, ప్రహ్లాద్ జోషి ఎలాంటి గందరగోళం లేకుండా, సిఎం ఎంపిక సజావుగా సాగేలా చూశారు. 2017 ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా ఘట్లోడియా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన భూపేంద్ర తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి శశికాంత్ పటేల్‌పై రికార్డ్ స్థాయిలో 1,17,000 ఓట్ల తేడాతో విజయభేరి మోగించారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి, ఉత్తరప్రదేశ్ మాజీ గవర్నర్ ఆనంద్‌బెన్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడ్డారు. ఈ రెండు అంశాలతోపాటు, పటేల్ సామాజిక వర్గానికే ఈ అవకాశాన్ని ఇవ్వాలన్న ఆలోచన కూడా భూపేంద్ర ఎన్నికలో కీలక పాత్ర పోషించింది. గతంలో అహ్మదాబాద్ అర్బర్ డెవలప్‌మెంట్ అథారిటీకి మేయర్‌గా వ్యవహరించిన ఆయన ప్రస్తుతం ఎంఎల్‌ఎగా ఉన్నారు. మంత్రిగా పని చేసిన అనుభవం ఏమీ లేదు. అయినప్పటికీ, పటేల్ సామాజిక వర్గం ఓట్ల కోసమే ఆయనకు ఏకంగా సిఎం పగ్గాలను బిజెపి అధిష్టానం అప్పగించింది. ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ కూడా గతంలో మంత్రిగా పని చేయకుండానే గుజరాత్ ముఖ్యమంత్రిగా పదవీబాధ్యతలు స్వీకరించారు. భూపేంద్ర ఆయన అడుగుజాడల్లోనే నడుస్తూ, సిఎం అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు మరో 16 నెలల గడువు మాత్రమే ఉండడంతో, ఆయన పార్టీని తిరిగి అధికారంలో తీసుకురావడంలో ఎంత వరకూ సఫలమవుతారన్నది ఆసక్తి రేపుతున్నది. ఇదిలా ఉండగా, సోమవారం భూపేంద్ర పటేల్ సిఎంగా ప్రమాణం చేయనున్నారు.
గుజరాత్ కొత్త సిఎంగా భూపేంద్ర పటేల్
RELATED ARTICLES