న్యూఢిల్లీ: ఢిల్లీలోని హింసాకాండ 2002నాటి గుజరాత్ అల్లర్లను తలపిస్తోందని, శాంతి, సాధారణ పరిస్థితి నెలకొనాలంటే సైన్యాన్ని పిలవాలని వామపక్షాలు అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ హింసాకాండపై వామపక్షాలు సంయుక్త విలేకరుల సమావేశం నిర్వహించాయి. కేం ద్రంలోనూ, ఢిల్లీలోనూ ఉన్న ప్రభుత్వాల నిష్క్రి య కారణంగా హింసాకాండ చెలరేగి కొందరి ప్రాణాలు పోయాయని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, సిపిఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి పేర్కొన్నారు. హోం మంత్రి అమిత్ షా హింసాకాండను ట్యాకిల్ చేస్తున్న తీరును రాజా, ఏచూరి ప్రశ్నించారు. ‘ఢిల్లీ పోలీసులకు ఒకవేళ ఎన్‌ఎస్‌ఎ ఇన్‌చార్జిగా ఉంటే అప్పుడు హోంమంత్రి పాత్ర ఏమిటి? ఢిల్లీ హింసాకాండను ట్యాకిల్ చేయడంలో హోంమంత్రి అమిత్ షా అసమర్థుడనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చిందా’ అని వారు ప్రశ్నించారు. 20మందిని బలిగొన్న, వందలాది మంది గాయపడ్డ ఢిల్లీ హింసాకాండ అకస్మాతుగా ఏమి పుట్టలేదని, దానికి బిజెపి నాయకుడు కపిల్ మిశ్రా రెచ్చగొట్టడమే కారణమని వారన్నారు. ‘హింసాకాండ అకస్మాతుగా పుట్టిందని అమిత్ షా తప్పించుకుంటున్నారు. ప్రజల్లో విశ్వసనీయతను పాదుకొల్పాలంటే దోషులపట్ల కఠిన చర్యలు తీసుకోవాలి. సివిలియన్ అధికారులకు సాయపడేందుకు సైన్యా న్ని పిలవాలి’ అని ఏచూరి అభిప్రాయపడ్డారు. ఇతర రాజకీయ పార్టీలతో కలిసి హింసాకాండకు ప్రభావితమైన ప్రాంతాలను తాము సందర్శిస్తామని వామపక్ష నాయకులు తెలిపారు. ‘పోలీసులు మౌన ప్రేక్షకుల మాదిరి వ్యవహరిస్తున్నారు. మేము అక్కడికి వెళతాము. ఆర్‌ఎస్‌ఎస్ గూండాలు దహనాకాండ, చంపివేతలకు, అరాచకానికి పాల్పడ్డారు’ అని రాజా ఈ సందర్భంగా ఆరోపించారు. ‘చనిపోయిన వారి కుటుంబ సభ్యులకు, గాయపడిన వారికి తగిన పరిహారం ఇవ్వాలి’ అని కూడా రాజా చెప్పారు.
కే్రంద హోం మంత్రి బాధ్యతవహించాలి: సిపిఐ
ఢిల్లీ హింసాకాండలో 20 మంది ప్రాణాలు పోగొట్టుకొన్న ఘటనకు కేంద్ర హోం మంత్రి బాధ్యత వహించాలి అంటూ భారత కమ్యూనిస్టు పార్టీ(సిపిఐ) జాతీయ కార్యవర్గం బుధవారం ఓ పత్రికా ప్రకటన విడుదలచేసింది. సిఎఎ అనుకూల మద్దతుదారులు హింసాకాండను కొనసాగించడంపై సిపిఐ జాతీయ కార్యవర్గం భయాందోళనలు, పరితాపాని వ్యక్తంచేసింది. హింసాకాండను జరుపుతున్నది ఆర్‌ఎస్‌ఎస్ గూండాలేనని కూడా పేర్కొంది. ఇప్పటికే హింసాకాండలో 20 మంది చనిపోయారని, వందలాది మంది గాయాలతో ఆసుపత్రి పాలయ్యారని పేర్కొంది. దేశ రాజధానిలో అనూహ్యంగా జరిగిన హింసాకాండకు హోం మంత్రి అమిత్ షా బాధ్యత వహించాలంది. పరిస్థితిపై సుప్రీంకోర్టు తనంతటతానే (సుమోటోగా) విచారణ చేపట్టి సైన్యాన్ని మోహరించేందుకు ఆదేశాలివ్వాలని సిపిఐ జాతీయ కార్యవర్గం తన ప్రకటనలో కోరింది. నిఘా ఉంచి, మైనారిటీ ప్రజలను కాపాడాలని కూడా వినతి చేసింది.
గుజరాత్ అల్లర్లను తలపిస్తోంది: లెఫ్ట్
RELATED ARTICLES