HomeNewsBreaking Newsగుజరాత్‌లో… తొలి దంగల్‌ నేడే

గుజరాత్‌లో… తొలి దంగల్‌ నేడే

89 నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికలు
ఉ॥ 8 నుంచి సా॥ 5 గంటల వరకు పోలింగ్
ఎన్నికల బరిలో 788 మంది అభ్యర్థులు
మొత్తం 14,382 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు
అహ్మదాబాద్‌:
గుజరాత్‌లో మొదటి విడత అసెంబ్లీ ఎన్నికలు గురువారం జరగనున్నాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు అంతా సిద్ధం చేశారు. కుచ్‌ 19 జిల్లాల్లో, రాష్ట్ర దక్షిణ ప్రాంతంలో ఉన్న 89 స్థానాల్లో పోలింగ్‌ జరగనుంది. ఈ స్థానాల్లో మొత్తం 788 అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొదటి విడత ఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో మంగళవారం సాయంత్రం 5 గంటల నాటికి ప్రచా రం ముగిసింది. కాగా, 14,382 పోలీస్‌ స్టేషన్‌లలో గురవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ముఖ్య ఎన్నికలు అధికారి (సిఇఒ) ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 4,91,35,400 మంది ఓటు హక్కు కలిగి ఉండగా, మొదడ విడత ఎన్నికల్లో 2,39,76,670 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. అందులో 5.74 లక్షల మంది ఓటర్లు 18 ఏళ్ల వయస్సు గలవారు కాగా, 99 ఏళ్లకు పైబడిన వారు 4,945 మంది ఉన్నట్లు రాష్ట్ర సిఇఒ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం 14,382 పోలీస్‌ స్టేషన్‌లలో పోలింగ్‌ జరగనుండగా, అందులో 3,311 పట్టణ ప్రాం తాల్లో, 11,071 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. అదే విధంగా 89 మంది మోడల్‌ పోలింగ్‌ స్టేషన్లను కూడా ఏర్పాటు చేసింది. చాలా స్టేషన్లను వికలాంగులు నిర్వహించనున్నారు. మరో 89 ఎకో ఫ్రెండ్లీ పోలింగ్‌ స్టేషన్లు కాగా, 611 కేంద్రాలను మహిళలు, 18 పోలింగ్‌ కేంద్రాలను యువత నడిపించనున్నట్లు అధికారులు ఆ ప్రకటనలో తెలిపారు. మొత్తం 34,324 బ్యాలెట్‌ యూనిట్లు, అంతే మొత్తంలో కంట్రోల్‌ యూనిట్లు, 38,749 ఓటర్‌ వేరిఫైబుల్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వివిప్యాట్‌) మెషన్లు ఈ ఎన్నికల్లో ఉపయోగించనున్నారు. పోలింగ్‌ సజావుగా జరిగేందుకు మొత్తం 2,20,288 శిక్షణ అధికారులను, ఉద్యోగులను విధుల్లో నిమగ్నం చేశారు. మొదటి విడతలో 27,978 మంది ప్రిసైడింగ్‌ అధికారులు, 78,985 పోలింగ్‌ అధికారులు వీధుల్లో ఉండనున్నట్లు అధికారులు చెప్పారు. మొదటి విడత కింద పోలింగ్‌ జరుగుతున్న 89 స్థానాల్లో 2017లో జరిగిన ఎన్నికల్లో 48 సీట్లలో బిజెపి గెలుపొందింది. కాంగ్రెస్‌ 40 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. బిజెపి, కాంగ్రెస్‌, ఆమ్‌ అద్మీ పార్టీ (ఆప్‌) కాకుండా బిఎస్‌పి, ఎస్‌పి, సిపిఐ(ఎం), బిటిపి సహా మరో 36 ఇతర రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలిపాయి. అయితే బిజెపి, కాంగ్రెస్‌లు మొత్తం 89 స్థానాల్లోనూ తమ అభ్యర్థులను రంగంలోకి దింపారు. రాష్ట్రంలో మొదటిసారి పోటీ చేస్తున్న ఆప్‌ కూడా 88 స్థానాల్లో అభ్యర్థులను నిలిబెట్టింది. అదే విధంగా బిఎస్‌పి 57 స్థానాల్లో, బిటిపి 14, సిపిఐ(ఎం) నాలుగు స్థానాలను పోటీ చేస్తోంది. ఈ మొదటి విడత ఎన్నికల్లో దాదాపు 339 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా పోటీలో ఉన్నారు. మొత్తం 788 మంది అభ్యర్థులకు గానూ 70 మంది మహిళలు ఉండగా, 9 మంది బిజెపి నుంచి, ఆరుగురు కాంగ్రెస్‌, ఐదుగురు ఆప్‌కు చెందిన వారు ఉన్నారు. ఇక ఆప్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి ఇసుదాన్‌ గంధ్వీ కంభాలియా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోపాల్‌ ఇటాలియా సూరత్‌లోని కాటర్గామ్‌ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. ఈ విడతలో ఉన్న స్థానాల నుంచి పోటీ చేస్తున్న ప్రముఖుల్లో క్రికెటర్‌ రవీంద్ర జడెజా భార్య రవిబ జడెజా, బిజెపి ఎంఎల్‌ఎలు సంఘవి, పుర్నేష్‌ మోడీలు ఉండగా, ఐదుసార్లు శాసనసభ్యుడిగా పనిచేసిన పురుషోత్తం సోలంకి కూడా ఉన్నారు. కుచ్‌ రీజియన్‌లోని 54 నియోజకవర్గాలకు కాంగ్రెస్‌కు కీలకం కానున్నాయి. ఈ రీజియన్‌లో 2017లో జరిగిన కాంగ్రెస్‌ పార్టీ 30 స్థానాల్లో గెలుపొందగా, 2012 ఎన్నికల్లో 16 సీట్లలో విజయం సాధించింది. దక్షిణ గుజరాత్‌లో పరిశీలిస్తే 2017 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పది స్థానాల్లో గెలిచింది.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments