తొలి రౌండ్‌లోనే వీనస్ విలియమ్స్‌ను ఓడించిన కొరీ
ఫెదరర్, జోకోవిక్, సెరీనా రెండో రౌండ్‌కు
ఆస్ట్రేలియా ఓపెన్
మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా ఓపెన్ ప్రారంభమైన తొలి రోజే సంచలన విజయం నమోదైంది. అమెరికా టీనేజ్ గర్ల్ కోరి గౌఫ్ అద్భుత విజయాన్నందుకుంది. అమెరికాకే చెందిన మాజీ వరల్డ్ నంబర్ వన్ వీనస్ విలియమ్స్‌ను తొలి రౌండ్‌లోనే మట్టికరిపించింది. సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో 15 ఏళ్ల గాఫ్ 7-6(5), 6-3తో వీనస్ విలియమ్స్‌ను ఓడించింది. ఆద్యాంతం అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్న గాఫ్.. వరుస సెట్లలో ప్రత్యర్థిని ఓడించి సెక్‌ండ రౌండ్‌లోకి ప్రవేశించింది.. మంగళవారం జరిగే రెండో రౌండ్‌లో సొరానా సిర్‌స్టి(రొమెనియా)తో తలపడుతుంది. విలియమ్సన్‌ను ఓడించడం గాఫ్‌కు ఇది రెండో సారి. గతేడాది జరిగిన ప్రతిష్టాత్మక వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్ తొలి రౌండ్‌లోనే వినస్ విలియమ్స్‌ను గాఫ్ మట్టికరిపించింది. వింబుల్డన్ టోర్నీ ద్వారా ఓపెన్ శకంలో (1968 నుంచి) మెయిన్ ’డ్రా’కు అర్హత పొందిన అతి పిన్న వయస్కురాలిగా (15 ఏళ్ల 122 రోజులు) గాఫ్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 2009 వింబుల్డన్‌లో బ్రిటన్‌కు చెందిన లారా రాబ్సన్ 15 ఏళ్ల వయసులో మెయిన్ ’డ్రా’లో ఆడింది. అయితే లారా రాబ్సన్‌కు టోర్నీ నిర్వాహకులు నేరుగా మెయిన్ ’డ్రా’లో ఆడేందుకు వైల్ కార్డు ఇచ్చారు.
కాగా, ఈ రోజు జరిగిన తొలి రౌండ్‌లో ఫెదరర్, జోకోవిక్. సెరీనా విలియమ్స్‌లు గెలిచి రెండో రైండ్‌లో అడుగుపెట్టారు.
గాఫ్ సంచలనం
RELATED ARTICLES