ప్రజ్ఞాసింగ్ ఠాగూర్ ప్రేలాపన
దుమ్మెత్తిపోసిన ప్రతిపక్షాలు
తప్పని పరిస్థితుల్లో క్షమాపణ చెప్పాలని కోరిన బిజెపి
గతిలేక మెట్టు దిగిన ఎంపి అభ్యర్థి
భోపాల్: లోక్ సభ ఎన్నికల్లో భోపాల్ నుంచి బిజెపి తరఫున బరిలోకి దిగిన ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మరో వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ‘నాథూరామ్ గాడ్సే నిజమైన దేశ భక్తుడు. ప్రజ లు ఆయనని ఉగ్రవాది అంటున్నారు. ఎంతో మంది ఆయనని దూషిస్తున్నారు. ఆయనను తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఆయనను మరో కోణంలో చూడకండి. ఆయనపై విమర్శలు గుప్పించిన వారికి ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు’ అని వ్యాఖ్యానించారు. అయితే తర్వాత కొన్ని గంటలకే ఆమె క్షమాపణలు చెప్పి తన ప్రకటనను ఉపసంహరించుకున్నారు. ఇటీవల సినీనటుడు, మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ హిందువులపై చేసిన వ్యాఖ్యలపై ఆమె స్పందించి మాట్లాడారు. కమల్ హాసన్ కొద్దిరోజుల క్రితం గాడ్సేపై వ్యా ఖ్యలు చేసిన విషయం తెలిసిందే. స్వతంత్ర భారత్‌లో ‘తొలి ఉగ్రవాది హిందువే’ అని వ్యాఖ్యానించారు. నాథూరామ్ గాడ్సేను ఉద్దేశిస్తూ ఆయన ఈ విమర్శ చేశారు. తమిళనాడులోని అరవకురిచిలో మే 12న ఓ ప్రచా ర ర్యాలీలో ఆయన ప్రసంగించారు. ‘ఈ ప్రాంతం లో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్న కారణంగా నేను ఈ వ్యాఖ్యలు చేయడం లేదు. గాంధీ విగ్రహం ఎదుట నిలబడి నేను ఈ మాటలు మాట్లాడుతున్నాను. స్వతంత్ర భారత్‌లో తొలి ఉగ్రవాది ఒక హిందువు.. ఆయన పేరు నాథూరామ్ గాడ్సే. అప్పటి నుంచే ఈ ఉగ్రవాదం ప్రారంభమైంది’ అని కమల్ హాసన్ చెప్పుకొచ్చారు. ఒక గాంధేయవాదిగా ఆయన హత్యకు గల కారణాలను తెలుసుకోవాలనుకుంటున్నానని కమల్ చెప్పారు. ‘మహాత్మా గాంధీని హత్య చేసిన వ్యక్తి దేశభక్తుడు కాలేడు’ అంటూ బిజెపి ఆమె ప్రకటనకు దూరమైంది. అంతేకాక ఆమె ఆ ప్రకటనకుగాను క్షమాపణలు చెప్పాలంది. ఆమె ప్రకటనను తాము పూర్తి గా వ్యతిరేకిస్తున్నట్లు బిజెపి ప్రతినిధి జివిఎల్ నర్సింహా రావు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రగ్యాసింగ్ ఠాకుర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసి క్షమాపణలు చెప్పడం నెల రోజుల్లో ఇది రెండోసారి. గత నెల ఆమె ‘ఐపిఎస్ అధికారి హేమం త్ కర్కరే తనను వేధించినందుకు తాను శపించినందునే చచ్చాడు’ అని వివాదాస్పద వ్యాఖ్య చేశారు. ఆ తర్వాత క్షమాపణలు చెప్పి ఆ ప్రకటనను కూడా వెనక్కి తీసుకున్నారు. మధ్యప్రదేశ్‌లోని అగ ర్ మాల్వాలో గురువారం మధ్యాహ్నం ఆమె న్యూ స్ ఛానెల్‌తో మాట్లాడుతూ ‘నాథురామ్ గాడ్సే దేశభక్తుడు. ఆయన దేశభక్తుడుగానే నిలిచిపోతారు. ఆయనను ఉగ్రవాది అంటున్నవారు ముందు తామేమిటో తెలుసుకోవాలి. ఈ ఎన్నికల్లో వారికి తగిన బుద్ధి చెబుతాము’ అన్నారు. కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యపై ప్రతిస్పందిస్తూ ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. దేవాస్ లోక్‌సభ సీటు నుంచి పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థి మహేంద్ర సోలంకికి మద్దతుగా ప్రగ్యాసింగ్ అగర్ మాల్వాలో రోడ్‌షోలో పాల్గొన్నారు. కొన్ని గంటల తర్వాత ఆమె ప్రతినిధి, బిజె పి నాయకుడు డాక్టర్ హితేశ్ బాజ్‌పాయ్ ఆమె తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారని పిటిఐ వార్తా సంస్థతో అన్నారు. దీనికి ‘రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు రాకేశ్ సింగ్‌కు ఆమెక్షమాపణలు చెప్పా రా?’ అని ప్రశ్నించినప్పుడు హితేశ్ బాజ్‌పాయ్”ఇదేమి వివాదం కాదు.కానీ ఆమె క్షమాపణలు చెప్పా రు. తన ప్రకటనను వెనక్కి తీసుకున్నారు’ అన్నారు.