భద్రపరిచే గడువు ముగిసిందంటూ..
ప్రభుత్వానికి లేఖ రాసిన గాంధీ సూపరింటెండెంట్
‘దిశ’ ఎన్‌కౌంటర్ మృతదేహాల అప్పగింతపై
హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన దిశ కేసులో ఎన్‌కౌంటర్‌కు గురైన నలుగురు యువకుల మృతదేహాలు గాంధీ మార్చు రీ గదిలో కుళ్లుతున్నా యి. సుప్రీంకోర్టు సూచనల మేరకు ఈ నెల 13న నలుగురి మృతదేహాలను భద్రపర్చాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడంతో ఈ నెల 9న మహబూబ్‌నగర్ మెడికల్ కళాశాలలో భద్రపరిచిన నిందితుల మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నెల 13 వరకు మాత్రమే మృతదేహాలను భద్రపరిచే బాధ్యతను గాంధీ మార్చురి అధికారులకు అప్పగించారు. ఇంత వరకు బాగానే ఉంది. హైకోర్టు ఆదేశాల మేరకు గాంధీ మార్చురి వైద్యులు నిందితుల మృతదేహాలను ఫ్రీజర్లో భద్రపరిచారు. హైకోర్టు వారికిచ్చిన గడువు ముగియడంతో మృ తదేహాలను ఏం చేయా లో తెలియక గాంధీ ఆసుపత్రి వర్గాలు ఆయోమయానికి గురవుతున్నారు. ఈ మేరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రావణ్‌కుమార్ ప్రభుత్వానికి లేఖ రాశారు. హైకోర్టు ఆదేశాల మేరకు తాము దిశ నిందితుల మృతదేహాలను భద్రపర్చడం జరిగిందని, ఇలాగే మరిన్ని రోజులు భద్రపరిస్తే శవాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని ఆ లేఖలో తెలిపారు. శవాల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకుని తమకు సూచించాలని లేఖలో కోరారు. గత నెల 27న శంషాబాద్ తొండుపల్లి టోల్‌ప్లాజా వద్ద డాక్టర్ దిశను నిందితులు ఆరీఫ్ అలీ, నవీన్, అత్యంత దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడి హతమార్చారు. అనంతరం అదే రోజు ఆమె మృతదేహాన్ని షాద్‌నగర్‌లోని చటాన్‌పల్లి బ్రిడ్జి కింద పెట్రోల్‌తో కాల్చివేశారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల్లోనే పై నలుగురు నిందితులను షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆ తరువాత కోర్టు అనుమతితో నిందితులను కస్టడీలోకి తీసుకుని విచారించే క్రమంలో ఈ నెల 6న చటాన్‌పల్లిలో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఈ ఎన్‌కౌంటర్‌పై పోలీసులపై పరస్పర ఆరోపణలు వచ్చాయి.ఈ క్రమంలోనే జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసును స్వీకరించి, కమిషన్ సభ్యులు హైదరాబాద్‌కు చేరుకుని ఎన్‌కౌంటర్‌పై ఆరా తీశారు.మరోపక్క మానవ హక్కుల సంఘాలు, న్యా యవాదులు ఎన్‌కౌంటర్‌పై అనుమానాలు వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు విచారణ కోసం త్రిసభ్య కమిషన్‌ను సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ వి.ఎస్. సిర్పుర్కర్ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఈ కమిషన్‌లో ముంబాయి హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖా ప్రకాశ్ బాల్డోట, సిబిఐ మాజీ డైరెక్టర్ డిఆర్ కార్తికేయన్ కూడా ఉన్నారు. ఆరు నెలల్లో నివేదిక అందించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇంత వరకు బాగానే ఉంది. అయితే గాంధీలో ఉన్న నిందితుల మృతదేహాలను మరోసారి పోస్టుమార్ట చేస్తా రా..? లేదా బాధిత కుటుంబ సభ్యులకు అప్పగిస్తారా..? అనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ విషయంపై త్రిసభ్య కమిషన్ తన అభిప్రాయాన్ని తెలియజేయాల్సి ఉంది. అయితే కమిషన్ సభ్యులు హైదరాబాద్‌కు వచ్చి పరిశీలించిన తరువాతనే మృతదేహాల అంశంపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మరోపక్క మృతదేహాల భద్రత అంశం సుప్రీంకోర్టులో శుక్రవారం విచారణకు వచ్చే అవకాశాలు కూడా ఉన్నా యి. దిశ నిందితులు నలుగురు ఎన్‌కౌంటర్‌లో మరణిం చి 12 రోజులు గడుస్తున్నా మృతదేహాలపై అటు ప్రభు త్వం, ఇటు త్రిసభ్య కమిషన్, సుప్రీంకోర్టు త్వరగా నిర్ణ యం తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అంత్యక్రియలు, తదితర అనవాయితీల ప్రకారం కుటుంబ సభ్యులు మృతులకు చేయాల్సిన కార్యక్రమాలు కొనసాగించాలంటే ఆటంకాలు ఏర్పడుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించే విషయంపై త్వరగా నిర్ణయం వెల్లడైతే బాగుంటుందని వారంటున్నారు.మరోపక్క ప్రభుత్వం నిర్ణయం కోసం గాంధీ ఆసుపత్రి వర్గాలు ఎదురు చూస్తున్నాయి.—–
గాంధీ మార్చురీలో కుళ్లుతున్న శవాలు
RELATED ARTICLES