ప్రజాపక్షం/హైదరాబాద్: మంగళవారం మరో ముగ్గురు కరోనా వ్యాధి లక్షణాల తో గాంధీ ఆసుపత్రిలో చేరారు. వైద్యసిబ్బంది వీరిని ప్ర త్యేక అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించి వెంటనే ప్రత్యే క ఐసోలేషన్ వార్డుకు తరలించి ఈ ముగ్గురికి వైద్యులు రక్త పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల ఫలితాలు వచ్చే వరకూ ఏమి చెప్పలేమని వైద్యులు చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కరో నా వైరస్ బారినపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే అతని ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వైరస్ సోకిన యువకు డు 10 రోజలుగా వైరస్ లక్షణాలతో ఉన్నట్లు తెలిసింది. దుబాయ్ నుంచి మొదలుకొని హైదరాబాద్ చేరే వరకూ ఇతను దాదాపు 88 మందితో సన్నిహితంగా ఉన్నట్లు తె లుస్తోంది. ఆ 86 మందికి సంబంధించిన సమాచారాన్ని అధికారులు సేకరిస్తున్నారు. ఇప్పటికే 45 మందిని గు ర్తించినట్లు తెలిసింది. వీరందరికీ గాంధీలో వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు దూరంగా ఉంచేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన యువకుడు తొలుత అపోలో ఆసుపత్రి లో చికత్స పొందగా, అక్కడి సిబ్బందిని కూడా గాంధీకి తరలించారు. సుమారు 10 మంది అపోలో సిబ్బందిని గాంధీకి తరలించి వారికి వైద్య పరీక్షలు చేసినట్లు తెలిసింది. యువకుడి బంధువులు, కుటుంబ సభ్యులను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం రాత్రి చేసిన 9 టెస్టులతో పాటు మంగళవారం వచ్చిన 13 కలిపి మొత్తం 22 మంది రిపోర్ట్ వెయింటింగ్‌లో ఉన్నట్లు గాంధీ ఆసుపత్రి కరోనా నోడల్ అధికారి వెల్లడించారు.
మహేంద్రహిల్స్‌లో సానిటైజేషన్
కరోనా బాధితుడి నివాస ప్రాంతం మహేంద్రహిల్స్‌లో కంటోన్మెంట్ బోర్డు ఆధ్వర్యంలో సానిటైజేషన్ చేశారు. బ్లీచింగ్ పౌడర్ చల్లడంతో పాటు చెత్త చెదారం తొలగించారు. అలాగే ఆ ప్రాంతంలో పాఠశాలలకు యాజమాన్యాలు సెలవులు ప్రకటించాయి. ఎవరికైనా కరోనా లక్షణాలు కనపడితే వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలని అధికారులు సూచించారు.
బులిటన్ విడుదల చేసిన వైద్యారోగ్యశాఖ
కరోనా వైరస్‌పై ప్రభుత్వం హెల్త్ బులిటన్ విడుదల చే సింది. మొత్తం 18224 ప్రయాణికులను శం షాబాద్ విమానాశ్రయంలో స్రీనింగ్ చేస్తే అందులో 445 ప్రయాణికుల్లో వైరస్ లక్షణాలను గుర్తించా రు. ఇందులో 100 ప్రయాణికులను 28 రోజుల వరకు అబ్జర్వషన్‌లో ఉంచినట్లు వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్ప టి వరకు ఒక పాజిటీవ్ కేసు నమోదు కాగా మరో 36 అనుమానిత కేసులు గాంధీలో నమోదయ్యాయి. మిగిలిన 408 మందిని తమ ఇంటి వద్దనే పర్యవేక్షణలో ఉం చారు. ఇటీవల దుబాయ్ నుంచి వచ్చిన ఓ యువకుడికి కరోనా పాజిటీవ్ రావడంతో అతనితో సబంధం ఉన్న 86 మంది అనుమానితులను అధికారులు గుర్తించి వై ద్యుల పర్యవేక్షణలో రక్త నమూనాలను సేకరించి అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. మంగళవా రం వరకు 155 శాంపిళ్లను ప్రయాణికుల నుంచి సేకరించినట్లు తెలిపారు. అందులో 118 మందికి నెటిటీవ్ అని తేలినట్లు 36 మందికి సంబంధించిన రిపోర్టులు రా వాల్సి ఉందని వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. ఇప్పటి వర కు హెల్ప్‌లైన్ ద్వారా 721 కాల్స్‌ను రిసీవ్ చేసుకున్నట్లు తెలిపింది.
సునీతా కృష్ణన్‌కు కరోనా పరీక్షలు….
ఓ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపకురాలు, మహిళల హక్కుల పోరాట సామాజిక కర్త సునీతా కృష్ణన్‌కు కరోనా లక్షణాలు ఉండడంతో గాంధీ ఆసుపత్రిలో కరోనా పరీక్షలను వైద్యులు చేశారు. కరోనా వైరస్ పరీక్ష ఫలితాలు వచ్చాయని, అందులో నెగిటివ్ అని తేలిందని ఆమె ప్రకటించారు.
గాంధీలో మరో ముగ్గురు అనుమానితులు…
సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో మంగళవారం ఉద యం మరో ముగ్గురు కరోనా అనుమానితులు చేరారు. వైద్య సిబ్బంది వారిని ప్రత్యేక అంబులెన్స్‌లో గాంధీకి త రలించారు. ఈ ముగ్గురికీ రక్త పరీక్షలు నిర్వహించారు. అయితే రక్త నమూనాల ఫలితాలు వచ్చే వరకూ ఎలాం టి నిర్ణయానికి రాలేమని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కరోనా వైరస్ బారిన పడి గాంధీలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. దీంతో పాటు మరో 45 మంది అనుమానితులను గాంధీలో ఉంచి చికిత్స చేస్తున్నారు.
గాంధీలో కరోనా లక్షణాలతో మరో ముగ్గురు
RELATED ARTICLES