సమ్మె, ప్రభుత్వ వైఖరి, కార్మికుల ఆత్మహత్యలపై తమిళిసైకి వివరించిన ప్రతినిధుల బృందం
హైదరాబాద్ : ఆర్‌టిసి కార్మికుల సమస్యలను పరిష్కరించి సమ్మెను విరమింపజేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వా న్ని ఆదేశించాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు ఆర్‌టిసి జెఎసి విజ్ఞప్తి చేసింది. రాష్ట్రం లో జరుగుతున్న ఆర్‌టిసి కార్మికుల సమ్మె, ప్రభు త్వ వైఖరి, కార్మికుల ఆత్మహత్యలు తదితర పరిస్థితిని ఆర్‌టిసి జెఎసి ప్రతినిధి బృందం గవర్నర్‌కు వివరించింది. ఆర్‌టిసి కన్వీనర్ ఇ.అశ్వద్ధామరెడ్డి, కోకన్వీనర్లు కె.రాజిరెడ్డి, వి.ఎస్.రావు, సుధ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సోమవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించింది. తమ సమస్యలను పరిష్కరించాలని ఆర్‌టిసి యాజమాన్యానికి, ప్రభుత్వానికి అనేకసార్లు విజ్ఞప్తి చేశామని, అయినా పట్టించుకోలేదని, చివరకు సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం తగిన విధంగా స్పందించలేదని, తప్పని పరిస్థితుల్లోనే సమ్మె చేపట్టామని జెఎసి నేతలు అశ్వద్ధామరెడ్డి, రాజిరెడ్డి గవర్నర్‌కు వివరించారు. అనంతరం అశ్వద్ధామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో కూడా ఇంతటి దుర్మార్గం చూడలేదన్నారు. మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతూ కార్మికులను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది తెచ్చుకున్న తెలంగాణలో స్వేచ్ఛలేదని, రాష్ట్రంలో దమణకాండపై గవర్నర్‌కు అన్నీ వివరించామని, గవర్నర్ సానుకూలంగా స్పందించారన్నారు. కె.రాజిరెడ్డి మాట్లాడుతూ మంత్రులు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వల్లే కార్మికులు ఆవేదనతో ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కార్మికులు ఎవ్వరూ ఆత్మ స్థుర్యైన్ని, సహనాన్ని కోల్పోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో జెఎసి నేతలు ఎస్.బాబు (ఆర్‌టిసి ఎంప్లాయీస్ యూనియన్), ఎం.ధామస్‌రెడ్డి, తిరుపతి (టిఎంయు) తదితరులు న్నారు.
గవర్నర్ జోక్యానికి ఆర్‌టిసి జెఎసి విన్నపం
RELATED ARTICLES