న్యూఢిల్లీ: గర్భాశయ క్యాన్సన్‌కు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో, దేశంలోనే తయారైన క్వాడ్రివాలెంట్ హ్యూమన్ పాపిల్లోమా వైరస్ వ్యాక్సిన్ వచ్చేసంది. 9 నుంచి 14 సంవత్సరాల లోపు బాలికలకు ఈ గర్భాశయ క్యాన్సర్ వ్యాక్సిన్-ను జాతీయ ఇమ్యూనైజేషన్ కార్యక్రమంలో భాగంగా అందించాలని కేంద్రం అందించనుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్‌ఐఐ) రూపొందించిన ఈ వ్యాక్సిన్-ను కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి జితేంద్ర సింగ్ గురువారం విడుదల చేశారు. ఈ వ్యాక్సిన్- తయారు చేసే బాధ్యతను అప్పగించిన నెల రోజుల్లోనే ఎస్‌ఐఐ దీనిని రూపొందించడం గమనార్హం. ‘90 శాతం గర్భాశయ క్యాన్సర్ నిర్దిష్ట వైరస్ వల్ల వస్తుంది. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంది’ అని ఈ వ్యాక్సిన్ విడుదల సందర్భంగా కొవిడ్ వర్కింగ్ గ్రూప్ చైర్పర్సన్, నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యునైజేషన్ డాక్టర్ ఎన్‌కె అరోరా అన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్ రాకతో భారతదేశ వైద్య శాస్త్రంలో ఒక మైలురాయి సాధించింది. కాగా, ఈ విషయమై కేంద్ర మంత్రి జితేంద్ర మాట్లాడుతూ ‘గర్భాశయ క్యాన్సర్‌కు స్వదేశీంగా అభివృద్ధి చేసిన మొట్టమొదటి వ్యాక్సిన్‌ను భారతదేశం విడుదల చేయడం ఎంతో సంతోషకరం. చిన్న వయసు మహిళల్లో ఈ క్యాన్సర్ ప్రబలంగా ఉంది. అప్పుడు దాని నుంచి విముక్తి కోసం మనకు వ్యాక్సిన్ అందుబాటులో ఉంది’ అని హర్షం వ్యక్తం చేశారు. ఎస్‌ఐఐ అధినేత అధర్ పూనంవాలా స్పందిస్తూ “ఈ వ్యాక్సిన్ ధరను కొద్ది రోజుల్లో ప్రకటిస్తాం. అయితే ఇది 200 రూపాయల నుంచి 400 రూపాయల మధ్య ఉండే అవకాశం ఉంది. అయితే భారత ప్రభుత్వంతో చర్చించిన అనంతరం ఎంత అనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటాం’ అన్నారు.
గర్భాశయ క్యాన్సర్‌కు వ్యాక్సిన్
RELATED ARTICLES