HomeNewsBreaking Newsగప్‌చుప్‌గా… గుట్కా దందా

గప్‌చుప్‌గా… గుట్కా దందా

బయటకు చెప్పేది పాన్‌మసాల వ్యాపారం
లోపల గుట్కా అమ్మకాలు
పట్టించుకోని అధికారులు
ప్రజాపక్షం/ సూర్యాపేట
ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం గుట్కాను నిషేధించినప్పటికీ సూర్యాపేట జిల్లా లో జోరుగా గుట్కా అమ్మకాలు సాగుతున్నా యి. గుట్కా దందాలో అధిక లాభాలు ఉండటంతో వ్యాపారులు పోలీసు కేసులకు కూడా భయపడకుండా క్రయవిక్రయాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కోదాడ, హుజూర్‌నగర్‌, నేరేడుచర్ల, తిరుమలగిరి మున్సిపల్‌ కేంద్రాల్లో అనేక మంది వ్యాపారులు నిషేధిత గుట్కా దందాను నడుపుతున్నట్లు సమాచారం. పాన్‌మసాల వ్యాపారం చేస్తున్నామని చెబుతూ వారు లోపల మాత్రం గుట్కాల అమ్మకాలు చేస్తున్నారు. సూర్యాపేట పట్టణ వ్యాపారులు కర్ణాటక రాష్ట్రంలోని బీదర్‌ నుండి గుట్కాను పెద్దఎత్తున కొనుగోలు చేసి ట్రాన్స్‌పోర్ట్‌ల ద్వారా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిసింది. పట్టణంలోని మార్కెట్‌ రోడ్డులో గత కొనేళ్ళుగా జనరల్‌ స్టోర్‌ నడుపుతున్న ఓ వ్యాపారి గుట్కా వ్యాపారం చేస్తూ పోలీసులకు చిక్కగా అతడిపై అనేక కేసులు నమోదు అయ్యాయి. ఖమ్మం రోడ్డులోని అమ్మ గార్డెన్‌ సమీపంలో కిరాణ దుకాణాన్ని నడుపుతున్న మరో వ్యాపారి, అలంకార్‌ రోడ్డులో జనరల్‌ స్టోర్‌ నడుపుతున్న ఇంకో వ్యాపారి కూడా ఏళ్లతరబడి నుండి గుట్కా అమ్మకాలు పెద్ద ఎత్తున చేస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. వీరే కాకుండా మరో 15 మందికిపైగా ఈ గుట్కా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారంటున్నారు. గుట్కా ప్యాకెట్‌పై ఉన్న ఎంఆర్‌పి ధర కంటే మూడింతల ధరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారని పలువురు చెంబుతున్నారు. ప్రతి రోజు లక్షల్లో అమ్మకాలు జరుగుతున్నాయంటే ఏ తీరుగా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారో ఇట్టే అర్ధం చేసుకోవచ్చు.
పట్టించుకొని అధికారులు
నిషేధిత గుట్కా దందా పట్టణంలో యాదేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని స్థానికంగా విమర్శలు ఉన్నాయి. గుట్కా వ్యాపారుల నుండి ప్రతి నెలా పెద్దమొత్తంలో మామ్ముళ్లు అందడం వల్లనే వారు అటు వైపు కన్నెతి కూడా చూడడం లేదని ఆరోపణలు వెల్లువెతుత్తున్నాయి. గుట్కా వ్యాపారం చేసే అందరిపై ఇప్పటికే అనేక కేసులు నమోదై ఉన్నాయి. గతంలో సిసిఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పెద్దఎత్తున జిల్లాలో దాడులు చేసి నిషేధిత గుట్కా నిల్వలను పట్టుకుని వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. నిషేధిత గుట్కా వ్యాపారాన్ని గత ఏడాది నుండి పోలీసులు ఏమాత్రం పట్టించుకోవడంలేదని, దీంతో వ్యాపారులు యాదేచ్చగా తమ వ్యాపారాన్ని సాగిస్తున్నారంటున్నారు. ఇప్పటికైనా పోలీసుశాఖ ఉన్నతాధికారులు స్పందించి గుట్కా దందాపై ఉక్కుపాదం మోపి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments