వర్షం పడి ధాన్యం తడిస్తే బాధ్యులెవరు..?
తేమ పేరుతో ఇబ్బంది
రైతుల ఆవేదన
ప్రజాపక్షం/కరీంనగర్ ప్రతినిధి: రైతన్న కంట కన్నీరొలికింది.. గన్ని సంచుల కొరతతో ఇబ్బందులు తట్టుకోలేక గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. దీంతో గంట పాటు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ప్రజలు ఇబ్బం ది పడ్డారు. 15 రోజులుగా గన్నీ సంచుల కోసం అవస్థలు పడుతున్నా.. పట్టించుకునే నాథుడే లేడని రైతులు వాపోయారు. అధికారులు వచ్చి చర్చలు జరపడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా రైతు ఐక్య వేదిక అధ్యక్షుడు ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని మార్కెట్‌కు తెస్తే కొందరు అధికారులు ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించా రు. గన్నీ సంచులు లేవని, తేమ పేరుతో రైతులను అవస్థల పాల్జేస్తున్నారన్నారు. 15 రోజులుగా రైతు లు పడిగాపులు కాస్తున్నా.. అధికారులు కనికరించడం లేదని, మార్కెట్‌లో కనీస వసతులు కూడా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గనిన్నీ సంచుల కోసం ఇన్‌ఛార్జ్ వ్యవసాయ మార్కెట్ అధికారిని రైతులు నిలదీశారన్నారు. గన్నీ సంచులు వస్తున్నాయని చెబుతున్నారే గాని.. అవి ఎప్పుడు వచ్చేది స్పష్టంగా తెలపడం లేదన్నారు. రాస్తారోకోలో రైతులు కాశెట్టి మురళి, దాడి మోహన్, ముత్యాల వెంకటేశం, శారద, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాల రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.