ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలి
వామపక్ష పార్టీ అభ్యర్థ్ధి జయసారథిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి
సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
ప్రజాపక్షం/చిలుకూరు : త్వరలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో వామపక్ష పార్టీ అభ్యర్ధి జయసారధిరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి కోరారు. మంగళవారం చిలుకూరు మండల కేంద్రంలో జరిగిన వామపక్ష పార్టీ సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమంలో వామపక్ష పార్టీలు కీలక పాత్ర పోషించాయన్నారు. అన్ని రాజకీయ పార్టీలు ఐక్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ గద్దెనెక్కి ఉద్యమపార్టీలను మరచిందని ఆయన అన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులు, విద్యార్థులను మరచిపోయిందని, దళితులకు మూడు ఎకరాల భూమిని ఇవ్వకుండా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మరచిపోయిందన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ ఇంటికో ఉద్యోగం పేరుతో అధికారంలోకి వచ్చిన టిఆర్‌ఎస్ పార్టీ నేడు ఇంటికి కాదుగా రాష్ట్రంలో ఏ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీకి అర్హత కలిగిన ఓటర్లు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. అనంతరం వామపక్ష పార్టీల అభ్యర్ధి జయసారధిరెడ్డి మాట్లాడుతూ తనను గెలిపిస్తే మండలంలో ప్రజా సమస్యలపై గొంతు వినిపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు దొడ్డా నారాయణరావు, సిపిఐ, సిపిఎం కార్యదర్శులు బెజవాడ వెంకటేశ్వర్లు, మల్లు నాగార్జునరెడ్డి, రాష్ట్ర నాయకులు ఉస్తేల సృజన, బుర్రి శ్రీరాములు, మేకల శ్రీనివాస్, ఉస్తేల నారాయణరెడ్డి, ధీరావత్ రవినాయక్, మండల కార్యదర్శులు మండవ వెంకటేశ్వర్లు, వేనేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా, మండల నాయకులు పిల్లుట్ల కనకయ్య, సాహెబ్‌అలీ, పోలేబోయిన గంగాధర్, కస్తూరి సత్యం, చేపూరి కొండలు, రాంబాబు, ఉపేందర్, శ్రీను, తదితరులు పాల్గొన్నారు.
గద్దెనెక్కి నిరుద్యోగులను మరచిన టిఆర్‌ఎస్
RELATED ARTICLES