ప్రజాపక్షం/హైదరాబాద్ దాదాపు మూడు సంవత్సరాల అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది. 2015, 2020 సంవత్సరాల అనంతరం ఈ సంవత్సరమే తెలంగాణ శకటానికి అవకాశం దక్కింది. ఈ సంవత్సరంతో పాటు వచ్చే మరో రెండేళ్ల పాటు కూడా తెలంగాణ శకటం ప్రదర్శనకు అనుమతి లభించింది. నిరంకుశ విధానాలు, రాజరిక, ఫ్యూడల్ వ్యవస్థలకు వ్యతిరేకంగా తెలంగాణలో
ఎన్నో ప్రజా ఉద్యమాలు వచ్చాయి. దీనిలో భాగంగా కొమరం భీం, రాంజీ గోండు, చాకలి ఐలమ్మ తదితర పోరాట యోధులు ఎందరో నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్వయం పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణకై తమ తమ పంథాలో పోరాటాం చేశారు. ఈ స్వీయ పాలన, ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తిని మరోసారి ప్రపంచానికి తెలియ చేసే విధంగా రిపబ్లిక్ దినోత్సవ వేడుకలో ప్రదర్శనకు రాష్ట్ర ముఖ్యమంత్రి సలహాతో శకటాన్ని రూపొందించారు. రాష్ట్ర ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమన్యయంతో ఈ శకటం స్వల్ప సమయంలో ఏర్పాటు అయిందని అధికారులు తెలిపారు. సమకాలీన కాలంలో ప్రజా సమస్యల పరిష్కారానికి, గ్రామసభలు, గ్రామ పంచాయితీల ఏర్పాటుకు దారితీసింది.‘జల్, జంగల్ జమీన్’ నినాదం ద్వారా అట్టడుగు వర్గాల భూములకు రక్షణ కల్పించడం జరిగింది. ఈ స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తి అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వ నిబద్ధతకు ఈ శకటం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందన్నారు.
గణతంత్ర దినోత్సవంలో ప్రదర్శనకు తెలంగాణ శకటం సిద్ధం
RELATED ARTICLES