న్యూఢిల్లీ: భారతదేశం గణతంత్ర వేడుకలను ఘనంగా జరుపుకుంది. భారత సైనిక సామర్థ్యం ఉట్టిపడేలా రాజ్‌పథ్‌లో ఉత్సవాలు అంబరాన్నంటాయి. ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్‌లో అమర జవాన్లకు నివాళి అర్పించారు. దేశ రక్షణకు ప్రాణత్యాగం చేసిన అమర జవాన్లను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా సైనికులు చేసిన గౌరవ వందనాన్ని మోడీ స్వీకరించారు. దేశ 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్ త్రివర్ణ పతాకాన్ని ఎగరేశారు. ఈ సందర్భంగా సైనిక దళం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొన్నారు. రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిధిగా వచ్చిన వివాదాస్పద బ్రెజిల్ అధ్యక్షుడు జయిర్ బొల్సనారోతో కలిసి ఆయన ఈ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సైనికుల గౌరవందనాన్ని వారు స్వీకరించారు. ఈ వేడుకల్లో సైనికులు చేసిన విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. దేశ రాజధానిలోని సిపిఐ కార్యాలయం అజయ్‌భవన్‌లో పార్టీ ప్రధాన కార్యదర్శి డి.రాజా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యదర్శి కె.నారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిజెపి ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా జాతీయ జెండా ఆవిష్కరించారు. ప్రధాన కార్యదర్శి హోదాలో ఆయన జెండాను ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పలువురు కేంద్రమంత్రులు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. జమ్మూకశ్మీర్‌లోని లడఖ్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 17 వేల అడుగుల ఎత్తున మంచుకొండలపై ఐటిబిపి సిబ్బంది జాతీయ జెండాను ఆవిష్కరించారు. మంచుకొండల్లో ప్రత్యేక విన్యాసాలు చేశారు. యుద్ధరంగంలో అమరులైన జవాన్లకు నివాళి అర్పించారు.
అదరగొట్టిన పెరేడ్
రాజ్‌పథ్‌లో గణతంత్ర వేడుకలు అద్భుతంగా జరిగాయి. శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించే ఆయుధాలు ఈసారి రిపబ్లిక్ డే పెరేడ్‌లో కొలువుదీరడం విశేషం. 71 ఏళ్ల చరిత్రలో తొలిసారి చోటుచేసుకొన్న ఘటనలు స్ఫురించేలా పెరేడ్ జరిగింది. సైనిక విన్యాసాలు, భారత సైనిక శక్తిని చాటే అధునాతన యుద్ధట్యాంకులు, ఆయుధ సంపత్తికి ఇది వేదిక అయింది. రక్షణ రంగంలో అతిపెద్ద సంస్కరణగా భావించే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సిడిఎస్)ను ఏర్పా టు చేశారు. సరికొత్త ఆయుధాలు సైన్యం అమ్ములపొదిలోకి చేరాయి.ఇవన్నీ ఈసారి పెరేడ్‌లో దర్శనమిచ్చాయి.
గణతంత్రం ఘనం!
RELATED ARTICLES