ముంబయి: వేతన జీవుల కష్టాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. గడిచిన దశాబ్దకాలంలోనే కనీవినీ ఎరుగనిరీతిలో ఈసారి అంటే 2020వ సంవత్సరంలో ఉద్యోగులు కష్టాలు ఎదుర్కొనబోతున్నారు. ఇప్పటికే ఆర్థిక మాంద్యం, ఇతర పరిస్థితులు అన్ని రంగాల్లోనూ ఉద్యోగుల వేతనాలపై ప్రభావం చూపాయి. ఈసారి వేతన పెరుగుదల పదేళ్లలో తక్కువగా వుండటం ఎంప్లాయీస్‌కు కష్టకాలమే. ఈ విషయాన్ని ‘ఎఆన్’ శాలరీ ఇంక్రీజ్ సర్వే వెల్లడించింది. 2020వ సంవత్సరంలో సగటు వేతనం పెరుగుదల కేవలం 9.1 శాతం మాత్రమేనని సర్వే తెలిపింది. ఇది ఆసియా పసిఫిక్ ప్రాంతంలోనే అత్యధికం కావడం విశేషం. 2019వ సంవత్సరంలో 9.3 శాతం మాత్రమే వేతనం పెరిగింది. ఇదే తక్కువ అని వేతనజనం బాధ పడుతుంటే, ఈసారి అంతకన్నా తక్కువగా 2020 సంవత్సర వేతనాలు (9.1% పెరుగుదల) ఉంటున్నాయి. గత పదేళ్లకాలంలో అంటే 2009 నుంచి ఇంత తక్కువగా జీతలు పెరగనుండటం ఇదే మొదటిసారి అని ఎఆన్ కొత్త అధ్యయనం వెల్లడించింది. ఈ-కామర్స్, స్టార్టప్ కంపెనీలు, ఇప్పుడిప్పుడే మొదలైన సంస్థలు, ప్రొఫెషనల్ సర్వీస్ ప్రొవైడర్లు వంటి సంస్థల్లో మాత్రమే 10 శాతం వేతనం పెరుగుదల కన్పించింది. మిగిలిన అన్ని రంగాల్లోనూ సగటు వేతన పెరుగుదల కేవలం 9.1% మాత్రమే. రవాణా, లాజిస్టిక్ సంస్థల్లో మరీ దారుణంగా కేవలం 7.6 శాతం మాత్రమే వేతనాలు పెరిగినట్లు సర్వే తెలిపింది. ఫార్మాస్యూటికల్స్, వైద్యపరికరాల రంగంలో 9.9 శాతం, హైటెక్, సమాచార సాంకేతిక పరిజ్ఞాన రంగంలో 9.6 శాతం, ఐటిఎస్‌లో 9.6 శాతం, ఎఫ్‌ఎంసిజి, వినిమయ వస్తు ఉత్పాదక రంగంలో 9.3 శాతం, రసాయన