గ్రామ సభల్లోనే ‘దళిత, బిసి బంధు’ ఎంపిక జరగాలి : చాడ
ప్రజాపక్షం/ కాజీపేట పేదల ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన గృహలక్ష్మి పథకం గడువు పొడిగించాలని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. మంగళవారం కాజీపేటలోని ఆర్‌ఎన్ నగర్, ఏఆర్‌ఆర్ నగర్ కాలనీలను సిపిఐ నాయకులతో కలిసి సందర్శించారు. పేదలు జీవో 58,59 కింద ధరఖాస్తు చేసుకున్న ఇండ్ల స్థలాలకు పట్టాలు, పేదల కాలనీలలో మౌలిక సదుపాయాలు అందుతున్నాయా.. లేదా అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో చాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ గృహలక్ష్మి పథకాన్ని ప్రభుత్వం తూతూ మంత్రంగా ముగించాలని చూస్తున్నదని అన్నారు.లబ్ది దారులు కుల, ఆదాయ దృవీకరణ పత్రాలు తీసుకువచ్చేందుకే వారం రోజుల సమయం పడుతుందని,ఈ దృష్ట్యా గడువును మరో 15 రోజులు పెంచాలని డిమా్‌ండ చేశారు.అలాగే జీవో 58,59 ల కింద ఆన్లైన్ లో ధరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇండ్ల స్థలాలకు, ఇండ్లకు పట్టాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న పేదల కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని డిమా్‌ండ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళిత బందుతో పాటు బిసి బందు, మైనారిటీ బందులలో లబ్ధి దారుల ఎంపికను ఎమ్మెల్యేల కనుసన్నల్లో కాకుండా గ్రామ సభల ద్వారా ఎంపిక చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు మునిగాల బిక్షపతి, మాలోతు శంకర్,బొట్టు బిక్షపతి, రాసమల్ల దీనా, బి. రాజమణి,ఎస్.స్వరూప,కుమార్,చందర్,జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
గడువు పొడిగించాలి
RELATED ARTICLES