నూతన సచివాలయ నిర్మాణ పనులు పరిశీలించిన సిఎం కెసిఆర్
వచ్చేనెల 17న ప్రారంభోత్సవం : మంత్రి వేములకు, ఇంజనీర్లకు ముఖ్యమంత్రి పలు సూచనలు
ప్రజాపక్షం/హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ భవన నిర్మాణ పనుల పురోగతిని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మంగళవారం మధ్యాహ్నం పరిశీలించారు. ఫిబ్రవరి 17న ప్రారంభోత్సవానికి తుదిమెరుగులు దిద్దుకుంటున్న సచివాలయ ముఖద్వారం మొదలుకొని నలు దిక్కులా కలియతిరిగి అణువణువునూ ఆయన పరిశీలించారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన సచివాలయ పనుల పురోగతి పరిశీలనలో, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సహా ఇంజనీర్లకు వర్క్ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. గడువులోగా నిర్మాణ పనులు పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం సచివాలయానికి చేరుకున్న సిఎం కెసిఆర్ ప్రధాన ద్వారం గుండా పరిశీలన ప్రారంభించారు. రక్షణ వ్యవస్థలను అమరుస్తూ తుది దశకు చేరుకున్న కాంపౌండ్ వాల్ నిర్మాణాన్ని పరిశీలిస్తూ ముందుకు సాగారు. ప్రధాన కట్టడానికి బయటి దిశగా నిర్మితమౌతున్న రోడ్ల ను పరిశీలించారు. అక్కడనుంచి నేరుగా నైరుతి దిక్కుగా నడుచుకుంటూ