సాధారణ వరికి రూ.149.. గ్రేడ్ ‘ఎ’కు రూ. 163
కేంద్ర కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: ప్రస్తుత (2023 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి పలు పంటలకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) పెంచుతూ కేంద్ర కేబినెట్ తీర్మానాన్ని ఆమోదించింది. 2023 బుధవారం ప్రధాని మోడీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ నిర్ణయాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ మీడియాకు వెల్లడించారు. క్విం టాల్ సాధారణ వరికి ప్రస్తుతం రూ. 2,040 ఉండగా, దానిని రూ. 143 పెంచినట్టుగా చెప్పారు. దీంతో క్వింటాల్ సాధారణ వరి కనీస మద్దతు ధర రూ. 2,183కి చేరింది. అలాగే క్వింటాల్ గ్రేడ్ -ఏ వరి ధర రూ. 163 పెరిగి రూ. 2,203కి చేరిందని ఆయన తెలిపారు. సాగుదారులకు వారి ఉత్పత్తులకు లాభదాయకమైన ధరలను నిర్ధారించడానికి, పంటల వైవిధ్యతను ప్రోత్సహించడానికి కనీస మద్దతు ధరను పెంచుతున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. కనీస మద్దతు ధరను అనేక సంవత్సరాలలో ఎన్నడూ లేనంతగా పెంచాలని కేబినెట్ నిర్ణయించిందని వెల్లడించారు. ఇక, పెసర పంటకు అత్యధికంగా కనీస మద్దతు ధర పెరిగింది. క్వింటాల్ పెసర ధర రూ.7,755 నుంచి రూ.8,558కి పెంచినట్టుగా మంత్రి గోల్ వెల్లడించారు. ఇక, పెసరకు 10.4 శాతం, నువ్వుల గింజలకు 10.3 శాతం, పొడవాటి ప్రధానమైన పత్తికి 10 శాతం, వేరుశెనగ నూనె 9 శాతం, మీడియం ప్రధానమైన పత్తికి 8.9 శాతం, వరికి 7 శాతం కనీస మద్దతు ధరను పెంచారు. ఇలావుంటే, నైరుతీ రుతుపవనాలతోనే ఖరీఫ్‌లో అత్యంత ప్రధానమైన వరి పంటకు నాట్లు మొదలవుతాయి. ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు నెలకొన్నాయని, సాధారణ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ (ఐఎండి) ప్రకటించింది.
ఖరీఫ్ పంటలకు మద్దతు పెంపు
RELATED ARTICLES