HomeNewsLatest Newsక‌రోనాపై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేయాలి

క‌రోనాపై అఖిల‌ప‌క్షం ఏర్పాటు చేయాలి

ప్ర‌జాప‌క్షం/హైదరాబాద్ : క‌రోనా సంక్షోభంపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితి వచ్చినా ప్రభుత్వం ప్రజలు ఒకటిగా ఎదుర్కొనే విధంగా సంసిద్దం కావాల‌ని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధికార ప్రతినిధి జి.నిరంజన్ ప్రధాన మంత్రి మోడీ, ముఖ్య మంత్రి కె.సి.ఆర్ లకు విజ్ఞప్తి చేశారు. వలస కూలీలు, తెల్ల కార్డులు లేని పేదల వివరాలు సేకరించి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఆదుకోవాల‌న్నారు. దేశ వ్యాప్తంగా వలస కూలీలకు ముందే భరోసా కల్గించి చర్యలు తీసుకుని ఉంటే వారికి ఇంత ఇబ్బంది కలిగేది కాద‌ని అన్నారు. ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన ఆదేశాలు క్షేత్ర స్థాయిలో ఖచ్చితంగా అమలు కావటానికి ప్రభుత్వ సిబ్బంది సరిపోరు. నియమాలు పాటిస్తూనే స్వచ్చంద సంస్థల సహకారం తీసుకోవాల‌ని సూచించారు. వారి వారి గ్రామాలకు పంపటానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం బస్సులను ఏర్పాటు చేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయాల‌ని, ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారికోసము ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసి ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. ఈ లాక్ డౌన్ 21 రోజుల తర్వాత కొనసాగదనే గ్యారంటీ లేనందున వలస కార్మికులను వారి గ్రామాలకు చేర్చి అవసరమైతే అక్కడే క్వారంటైన్ లో ఉంచే విధంగా ఆలోచించాల‌ని, ఈ విపత్కర పరిస్థితులలో వలస కూలీలు వారి కుటుంబాలకు చేరువుగా లేకుంటే మానసిక ఆందోళనకు గురవవుతార‌ని పేర్కొన్నారు. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి 12 కిలోల బియ్యం , కార్డుకు 1500 రూపాయలు ప్రకటించి 6 రోజులు కావస్తున్నా పంపిణీ మొదలు కాలేద‌ని, కార్డు దారులు రోజూ రెండు మూడు గంటలు రేషన్ షాప్ వద్ద వేచి ఉండి వెళ్ళుతున్నార‌ని అన్నారు. సమాయత్తం కావడానికి సమయము అవసరమైనా ప్రజలు అసహనానికి గురికాకుండా కచ్చితమైన సమాచారాన్ని ఇవ్వాల‌న్నారు. పంపిణీ సమయములో స్వీయ నియంత్రణ ఏర్పాట్లు చేయడానికి బస్తీ సంక్షేమ సంఘాల సహకారం తీసుకోమని రేషన్ డీలర్లను ఆదేశించాల‌ని కోరారు. బిపిఎల్ లోపున ఉన్నా తెల్ల కార్డు లేని వారు అనేకులు ఉన్నార‌ని, వారి వివరాలు కూడా సేకరించి ఆదుకొని సహాయమందించాల‌ని డిమాండ్ చేశారు. ఈ పరిస్థితి ఇదే విధముగా దీర్ఘ కాలము కొనసాగితే BPL లోపు, బయట ఉన్నవారు , మధ్య తరగతి వారు అనే తేడా లేకుండా అందరిని ఆదుకునాల్సిఉంటుంద‌ని, కావున ప్రభుత్వము అందుకు తగ్గ వివరాలు సేకరించి సంసిద్ధమై ఉండాలని కోరుతున్నామ‌న్నారు. ప్రధాన మంత్రి మోడీ, ముఖ్య మంత్రి కె.సి.ఆర్, కేంద్ర హోమ్ శాఖా సహాయమంత్రి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి సంతోష్ గంగ్వార్ లకు నిరంజ‌న్ వేర్వేరుగా ఈమెయిల్ ద్వారా విజ్ఞప్తులను పంపించారు.

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments