HomeOpinionArticlesక‌రోనాకు కార‌ణం కార్పొరేట్ శ‌క్తులే

క‌రోనాకు కార‌ణం కార్పొరేట్ శ‌క్తులే

కరోనా నివారణకు చైనా ఖర్చు చేసినట్లుగా ప్రపంచంలోని ప్రభుత్వాలు నిధులు వెచ్చించవు. ప్రజలపై సెజ్‌ రూపంలో, కరోనా సర్వీసు టాక్సు రూపంలో తిరిగి ప్రజలనే బాధించే అవకాశాలే ఎక్కువ. నల్లధనం ఉన్న వారు, కార్పొరేట్లు కరోనా నివారణకు ముందుకు రావటం లేదు. ఆర్థిక సహాయం చేయటం లేదు. వాస్తవానికి జీవ వైవిధ్యాన్ని చెడగొట్టిన కార్పొరేట్‌ శక్తులే పర్యావరణాన్ని నాశనం చేసి ఇన్ని నూతన అంటువ్యాధులు ప్రబలటానికి కారకులవుతున్నారు.

కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ దేశాల్లో కోట్లాది మంది ప్రజానీకం ఉద్యోగాలు కోల్పోతున్నారు. అనేక కోట్లాది ప్రజలు, చిన్న చిన్న వ్యాపారస్తులు, రోజు వారి వేతనాలపై ఆధారపడి జీవిస్తున్న కూలీలు, అసంఘ టిత కార్మికులు వీధిపాలవుతున్నారు. 2008-09 సంవత్స రాల్లో సంభవించిన ప్రపంచ ఆర్థిక మాంద్యంలో 2 కోట్ల 20 లక్షలు ఉద్యోగాలు ఊడాయి. అప్పట్లో దీని ప్రభావం అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలపై పూర్తిగా పడలేదు కూడా. కానీ ప్రస్తుత కరోనా వ్యాధి నేపథ్యంలో రానున్న నెలల్లో ప్రపంచంలోని అనేక దేశాల్లో రెండున్నర కోట్ల ఉద్యోగాలు పోగొట్టుకొని నిరుద్యోగుల చెంతన చేరనున్నారని ఇంటర్నే షనల్‌ లేబర్‌ ఆర్గనైజేషన్‌ (ఐఎల్‌వో) తెలియజేసింది. ”కరోనా వ్యాధి కేవలం ప్రపంచ ఆరోగ్య సంక్షోభమే కాద ని, దీని ద్వారా లేబర్‌ మార్కెట్‌లో సంక్షోభం, ఆర్థిక సంక్షోభం ఏర్పడటం ద్వారా దీని పర్యవసానాలతో ప్రజల జీవన స్థితిగతులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని” ఐఎల్‌వో డైరెక్టరు జనరల్‌ గరురైడర్‌ అన్నారు. 2020 సంవత్సరానికి ప్రపంచ వ్యాపితంగా కార్మిక రంగంలో ఊహించిన పేదరికం కంటే అదనంగా 88 లక్షల నుండి మూడున్నర కోట్ల కార్మికులు దారిద్య్ర రేఖ దిగువకు వెళ్లే ప్రమాదమున్నదని ఐఎల్‌వో తెలిపింది. కొన్ని వర్గాల ప్రజలపై కరోనా వ్యాధి తీవ్ర ప్రభావం చూపటం ద్వారా ప్రపంచంలో నేడున్న ఆర్థిక అసమానతలు మరింత పెచ్చ రిల్లే అవకాశాలు ఉన్నాయని ఐఎల్‌వో తెలిపింది. సాంఘిక భద్రతకు దూరంగా ఉండి తక్కువ వేతనాలు పొందే ఉద్యో గులు, ముఖ్యంగా యువత, వృద్ధులపైననై, మహిళలు, శరణార్థులపైననూ ప్రభావం ఉంటుందని తెలిపింది.
ఐక్యరాజ్య సమితి ఐఎల్‌వో అంచనాల ప్రకారం ఇప్పటికే కార్మికులు కరోనా వ్యాధి బారిన పడటంచే 30 వేల పని నెలల జీతాలు కోల్పోయారని, రానున్న కాలంలో ఉద్యోగాలు పోవటం ద్వారా కార్మిక లోకం 86 వేల కోట్ల డాలర్ల నుండి 3.4 లక్షల కోట్ల డాలర్ల ఆదాయం కోల్పోతారని పేర్కొంది.
ఇప్పటికే తయారీ రంగంలోనూ, హోటల్స్‌, ఎయిర్‌ లైన్స్‌, సర్వీస్‌ సెక్టారులోనూ, కళలు – వినోదంకు చెందిన అనేక రంగాల్లోని సంస్థలు మూతబడి లేఆఫ్‌లు ప్రకటించబడినాయి. 1940 తర్వాత ఇప్పుడు యూరపు లోనూ, అమెరికాలోనూ మొదటి సారిగా భారీ పరిశ్రమలు కూడా మూతబడుతున్నాయని బ్లూమ్‌బెర్గ్‌ తెలియజేసింది. గత వారం అమెరికాలోని మెట్రోపాలిటన్‌ ఓపేరాను మూసివేసి ఉద్యోగులను, గాయకులను, సంగీత విద్వాం సుల్ని ఇంటికి పంపించటం జరిగింది. ప్రపంచంలో అనేక సినిమాహాళ్లు మూతబడ్డాయి. హోటల్‌ రంగంలో చిన్న స్థాయి హోటల్స్‌ నుండి 5 నక్షత్రాల హోటళ్ల ఉద్యోగులు ఇంటికి వెళ్ళవలసిన పరిస్థితులు ఏర్పడుతు న్నాయి. విమానయాన రంగంలో స్కాండినావియన్‌ ఎయిర్‌లైన్స్‌ 90 శాతం స్టాఫ్‌ను (పదివేల మంది ఉద్యోగులు) బాధ్యతల నుండి తప్పించింది. నార్వేగియన్‌ ఎయిర్‌లైన్స్‌ 50 శాతం ఉద్యోగుల్ని అంటే 7,300 మంది కి ఉద్వాసన పలికి 4 వేల విమానాలు రద్దు చేసింది. ఈ విధంగా ప్రపంచంలోని అతి పెద్ద ఎయిర్‌లైన్స్‌లన్నీ లుఫ్టాంజా, కె.ఎల్‌.ఎమ్‌, ఎమిరేట్స్‌, బ్రిటిష్‌ ఎయిర్‌ వేస్‌ వంటి అన్ని సంస్థలు విమానాల్ని దించేసి సిబ్బందికి దీర్ఘ కాలిక సెలవులు ఇవ్వటమో, ఉద్యోగాలకు ఉద్వాసన పలకటమో చేశాయి. ప్రస్తుతం అమెరికాలో 9 శాతం వర్కర్లు అంటే కోటీ 40 లక్షల కార్మికుల ఉద్యోగాలు ఊడాయి. మరొక 25 శాతం ఉద్యోగులు తక్కువ గంటలు పనిచేస్తున్నారు. అమెరికాలోని అన్ని రాష్ట్రాల్లోనూ ప్రభావం తీవ్రంగా ఉంది.షేర్‌ మార్కెట్లు ఇప్పటికే భారీ పతనాల్ని చూపు తున్నాయి. ఇంకా నష్టాల ఊబిలోకి కూరుకుపోతాయని లేబర్‌ డిపార్టుమెంటుపైనా, ఆరోగ్య శాఖపైనా ఒత్తిడులు తెస్తూ వాస్తవ కరోనా గణాంకాలను కార్పొరేట్లు, ప్రభు త్వాలు వెల్లడించనీయడం లేదు.
2020 సంవత్సర రెండవ త్రైమాసంలో 30 శాతంకు అమెరికా నిరుద్యోగం పెరుగుతుందని ఫెడరల్‌ రిజర్వు బ్యాంక్‌ సిఇవో అండ్‌ డైరెక్టర్‌ జేమ్స్‌ బల్లాడ్‌ బ్లూమ్‌ బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పాడంటే కరోనా వైరస్‌ తీవ్రతను స్పష్టం చేస్తుంది. దీని ప్రభావం మన దేశంపై భారతదేశ ఎన్‌ఆర్‌ఐలపై కూడా తీవ్రంగా ఉంటుంది. నిరుద్యోగ భృతి కోసం అమెరికాలోనూ, యూరపు దేశాల్లోనూ దరఖాస్తుల వెల్లువలు విపరీతంగా పెరుగుతున్నాయి.
నూతన ఆర్థిక మాంద్యం
కరోనా వైరస్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్ర గాయ మైందని, 2020 ఆర్థిక వృద్ధిరేటు నెగిటివ్‌కు వెళ్తుందని, దీని ప్రభావం 2009-09 ఆర్థిక మాంద్యం కంటే ఎక్కువగా ఉంటుందని ఐఎమ్‌ఎఫ్‌ అధ్యక్షురాలు కృష్టాలీనా జార్జివా మార్చి 23వ తేదీన వాషింగ్టన్‌లో జి 20 ఆర్థిక మంత్రుల సమావేశంలో పేర్కొంది. ఐఎమ్‌ఎఫ్‌ అవస రమైతే ఒక లక్ష కోట్ల డాలర్ల రుణ సదుపాయాలను తక్కువ ఆదాయ వనరులు గల దేశాలకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. మరోవైపు అమెరికా ఆర్థిక వ్యవస్థ అంతంతమాత్రం ఉన్నా ఎప్పటి వరకు వాల్‌ స్ట్రీట్‌ ను లాబీయింగు చేస్తూ ప్రపంచ దేశాల కరెన్సీని డాలరు కు అనుకూలంగా దిగజార్చుతున్నది. అమెరికా ఎక్సేంజ్‌ వ్యవస్థ. ఇప్పటికే ఇదివరకెన్నడూ లేనంతగా మన రూపా యి విలువ డాలరుతో 76 రూపాయలకు పైగా పడిపో యింది.
కరోనా వైరస్‌ అంతిమంగా సామాన్య ప్రజలను కష్టాలపాలు చేస్తోంది. నిరుద్యోగం పెరగటం, వైద్యం భారం కావటం, చిన్నా చితకా ఆస్తుల్ని అమ్ము కోవడం, బ్యాంకుల్లో దాచుకొన్న కొద్దిపాటి పొదుపులకు విలువ లేక పోవటం ఆందోళనకు గురై వస్తు సదుపాయాల్ని ఏర్ప రచుకొనే ప్రక్రియలో కంపెనీల స్టాక్సు క్లియరు అయి పోగా, ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు ఇవ్వబోయే ఉద్దీ పన చర్యలతో కంపెనీ షేర్లు కారు చౌకగా కార్పొరేట్లు కొనుక్కోవటం జరుగుతుంది. అంతిమంగా ప్రభుత్వం ఇచ్చిన దీaఱశ్రీశీబ్‌ర (ఉద్దీపన చర్యలు) మొత్తాన్ని పన్నుల రూపంలో తిరిగి ప్రభుత్వాలు వసూలు చేస్తుంటే సామాన్య మానవునిపై పెనుభారం పడి ఇంకా ఆర్థిక అసమానతలు పెరగటం ఖాయం. కరోనా నివారణకు చైనా ఖర్చు చేసి నట్లుగా ప్రపంచంలోని ప్రభుత్వాలు నిధులు వెచ్చించవు. ప్రజలపై సెజ్‌ రూపంలో, కరోనా సర్వీసు టాక్సు రూపం లో తిరిగి ప్రజలనే బాధించే అవకాశాలే ఎక్కువ. నల్లధనం ఉన్న వారు, కార్పొరేట్లు కరోనా నివారణకు ముందుకు రావటం లేదు. ఆర్థిక సహాయం చేయటం లేదు. వాస్త వానికి జీవ వైవిధ్యాన్ని చెడగొట్టిన కార్పొరేట్‌ శక్తులే పర్యా వరణాన్ని నాశనం చేసి ఇన్ని నూతన అంటువ్యాధులు ప్రబలటానికి కారకులవుతున్నారు.

(విశాలాంధ్ర సౌజ‌న్యంతో)

DO YOU LIKE THIS ARTICLE?
RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments