ముగిసిన సమీర్‌వర్మ, ప్రణీత్ పోరాటం
ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీ
బర్మింగ్‌హామ్: భారత స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, కిదాంబి శ్రీకాంత్ ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌లో ప్రవేశించారు. మరోవైపు సమీర్ వర్మ, బి. సాయి ప్రణీత్‌ల పోరాటం ముగిసింది. గురువారం ఇక్కడ జరిగిన మహిళల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో భారత స్టార్, ఎనిమిదో సీడ్ సైనా నెహ్వాల్ 8 21 21 తేడాతో డెన్మార్క్‌కు చెందిన లైన్ హొజ్‌మార్క్‌ను ఓడించి క్వార్టర్స్‌లో దూసుకెళ్లింది. తొలి గేమ్‌లో తడబడిన సైనా 8 తేడాతో ఈగేమ్‌ను కోల్పోయింది. తర్వాత పుంజుకున్న సైనా దూకుడు ప్రదర్శిస్తూ ప్రత్యర్థిపై విరుచుకుపడింది. సైనా జోరుకు డెన్మార్క్ క్రీడాకారిణీ రెండో గేమ్‌ను కోల్పోయింది. ఇద్దరూ చెరో గేమ్ గెలిచి ఉండంతో ఆఖరి గేమ్ ఇద్దరికి కీలకంగా మారింది. ఇప్పటికే టైటిల్ ఫేవరేట్లలో ఒకరు సింధు తొలి రౌండ్‌లోనే ఇంటి ముఖం పట్టడంతో మరో భారత స్టార్ సైనా భారత్ ఆశలు తానపై వేసుకుంది. ఈ నిర్ణాయాత్మక ఆఖరి గేమ్‌లో సైనా చెలరేగి ఆడింది. వరుస స్మాష్‌లతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేస్తూ చివరికి 21 తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా సొంతం చేసుకుంది. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో భారత స్టార్, ఏడో సీడ్ కిదాండి శ్రీకాంత్ 21 11 21 ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జొనాథన్ క్రిస్టీ (ఇండోనేషియా)ను చిత్తు చేసి క్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టాడు. హోరాహోరీగా జరిగిన ఈ పోరులో తొలి గేమ్‌ను గెలుచుకున్న శ్రీకాంత్ తర్వాతి గేమ్‌లో మాత్రం తేలిపోయాడు. అనంతరం తేరుకున్న శ్రీకాంత్ నిర్ణయాత్మకమైన ఆఖరి గేమ్‌లో అద్బుతంగా ఆడుతూ ప్రత్యర్థిపై ఎదురుదాడికి దిగాడు. దూకుడైన షాట్లతో వరుసగా పాయింట్లు సాధిస్తూ ఆధిక్యంలో దూసుకెళ్లాడు. చివరి వరకు అదే జోరును కనబర్చిన శ్రీకాంత్ భారీ తేడాతో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కూడా దక్కించుకున్నాడు. ఇక క్వార్టర్ ఫైనల్లో శ్రీకాంత్‌కు కఠినమైన ప్రత్యర్థి ఎదురయ్యాడు. శ్రీకాంత్ క్వార్టర్ ఫైనల్లో జపాన్ స్టార్, నెంబర్‌వన్ సీడ్ కెంటొ మొమోటాతో తలపడనున్నాడు. పురుషుల మరో సింగిల్స్‌లో బి.సాయి ప్రణీత్ 19 19 తేడాతో లాంగ్ ఆంగుస్ (హాంగ్‌కాంగ్) చేతిలో ఓడాడు. యువ క్రీడాకారుడు సమీర్ వర్మ తొలి రౌండ్‌లోనే ఓడి ఇంటి ముఖం పట్టాడు.
క్వార్టర్స్‌లో సైనా, శ్రీకాంత్
RELATED ARTICLES