కౌలాలంపూర్ : మలేసియా ఓపె న్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. ఇప్పటికే స్టార్ షట్లర్లు సైనా నెహ్వాల్, పివి సింధు, హెచ్ఎస్ ప్రణయ్‌లు ఓట ములతో ఇంటి ముఖం పట్టిన విష యం తెలిసిందే. ఇక తాజాగా మరో స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీ కాంత్ సైతం క్వార్టర్ ఫైనల్లో ఓట మిపాలై టోర్నీ నుంచి నిష్క్రమిం చాడు. శుక్రవారం జరిగిన పురు షుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఎనిమిదో సీడ్ కిదాంబి శ్రీకాంత్ 18 19 తేడాతో చైనా స్టార్, నాలుగో సీడ్ చెన్ లాంగ్ చేతిలో పోరాడి ఓడాడు. ఆరంభం నుంచే ఇద్దరి మధ్య పోటీ హోరాహోరీగా జరిగింది. తొలి గేమ్ నుంచే ఒకరిపై మరొకరు దాడులు చేసుకుంటు చెరో పాయింట్ సాధిస్తూ ముందుకు సాగారు. ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన కిదాంబి ఆఖర్లో కాస్తా తడబడ్డాడు. దీన్ని సొమ్ముచేసుకున్న ప్రత్యర్థి మూడు పాయింట్లతో తేడాతో తొలి గేమ్‌ను గెలుచుకున్నాడు. తర్వాత రెండో గేమ్‌లోనూ ఇద్దరూ ఉత్కంఠంగా తలపడ్డారు. నువ్వా.. నేనా.. అన్నట్టు సాగిన ఈ గేమ్‌లో ఒకవైపు కిదాంబి దూకుడు ప్రదర్శిస్తుంటే.. మరోవైపు చెన్ లాంగ్ కూడా తన జోరును ప్రదర్శించాడు. వరుస స్మాష్‌లతో కిదాంబిపై ఎదురుదాడికి దిగాడు. ఒక సమయంలో మ్యాచ్‌పై కిదాంబి పట్టు సాధించిన చివర్లో చైనా ఆటగాడు విజృంభించడంతో హోరాహోరీగా తలపడ్డ కిదాంబి ఆఖర్లో రెండు పాయింట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచే వైదొలిగాడు.
క్వార్టర్స్‌లో శ్రీకాంత్ పరాజయం
RELATED ARTICLES