దూసుకుపోతున్న సింధు, సైనా
మలేసియా మాస్టర్
కౌలాలంపూర్: భారత స్టార్ షట్లర్లు పివి సింధు, సైనా నెహ్వాల్ మలేసియా మాస్టర్స్ సూపర్ – 500 బ్యాడ్మింటన్ టోర్నీలో చక్కగా ఆడుతున్నారు. మహిళల సింగిల్స్‌లో గురువారం వీరిద్దరూ క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు. ఆరో సీడ్ సింధు 21-10, 21-15 తేడాతో జపాన్ అమ్మాయి అయా ఓహోరిపై ఘన విజయం సాధించింది. కేవలం 34 నిమిషాల్లో ప్రత్యర్థిని ఓడించింది. ఆమెపై సింధుకు ఇది వరుసగా తొమ్మిదో విజయం కావడం గమనార్హం. తర్వాతి పోరులో ప్రపంచ నంబర్‌వన్ తైజు ఇంగ్ (చైనీస్ తైపీ) లేదా దక్షిణ కొరియా క్రీడాకారిణి సంగ్ జి య్యూన్‌తో తలపడే అవకాశం ఉంది. దక్షిణ కొరియా షట్లర్ అన్ సె యంగ్‌తో జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో సైనా నెహ్వాల్ 25-23, 21-12 తేడాతో విజయం అందుకుంది. తొలి గేమ్ అత్యంత ఉత్కంఠకరంగా సాగింది. ప్రత్యర్థిపై సైనాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం. తర్వాత పోరులో భారత షట్లర్‌కు గట్టిపోటీ ఎదురుకానుంది. క్వార్టర్ ఫైనల్లో ఒలింపిక్ విజేత కరోలినా మారిన్‌తో ఆమె తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో సమీర్ వర్మ 19-21, 20-22 తేడాతో మలేసియా షట్లర్ లీ జీ జియా చేతిలో పరాజయం చవిచూశాడు.
క్వార్టర్స్‌లో భారత షట్లర్లు
RELATED ARTICLES